దాదాపు గత రెండు నెలల  నుంచి క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసులైన ఎంటర్టైర్మెంట్ పంచుతూ వచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి తెరపడింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్లో నాలుగు సార్లు ఛాంపియన్ అయిన చిన్న సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టును ఓడించి ఐదోసారి కప్పు గెలుచుకుంది అని చెప్పాలి. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ తో ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కు తెరపడగా  మరికొన్ని రోజుల్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ డబ్ల్యూటిసి ఫైనల్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.



 ఇంగ్లాండ్లోని లండన్లో ఓవల్ మైదానం వేదికగా డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య హోరా హోరి పోరు జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో ఉన్న నేపథ్యంలో ఇరుదేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోయే జట్టు సభ్యుల వివరాలను ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా ఇదే విషయంపై స్పందిస్తూ తమ జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అని విషయంపై తెగ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఇకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ లో భారత తుది జట్టు కూర్పు గురించి ఇటీవల ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ స్పందించాడు.



 లండన్ వేదికగా జరగబోయే డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో ఇషాన్ కిషన్ ఉంటే మంచిది అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ జట్టులో లేకపోవడంతో అతని స్థానాన్ని ఇషాన్ కిషన్ భర్తీ చేయగలడు. మ్యాచ్ గెలవడం కోసం అతడు అత్యధిక స్కోరింగ్ రేట్లు అందించగలడు. అతనిలో కీపింగ్ నైపుణ్యాలు కూడా బాగున్నాయి. ఒకవేళ తానే గనుక టీమ్ ఇండియా సెలక్షన్ కమిటీ లో ఉండి ఉంటే తప్పకుండా ఇషాన్ కిషన్ కు తుది జట్టులో ఛాన్స్ ఇస్తాను అంటూ చెప్పుకొచ్చాడు రికీ పాంటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: