నాటికీ నేటికీ ఏ నాటికీ..మహాభారతం అనే మహా కావ్యం గురించి తెలియని హిందూ మతస్థులు ఉండరనే చెప్పాలి. పసిపిల్లల నుండి పెద్ద వయస్సు వారి వరకు ఇప్పటికీ అందులోని కథలను వింటూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. మరియు ఇందులోని విలువలను, నీతిని ఎంతో చక్కగా పలువురికి చెబుతూ ఉంటారు. ఇందులో మంచి ఉంది మరియు చెడు ఉంది. కానీ మనకు ఏది అవసరమో దానినే మనము తీసుకోవాలి.