వినాయక నిమజ్జనోత్సవంలో ఈ ఏడాది ఖైరతాబాద్ బడా గణేశుడు చరిత్ర సృష్టించాడు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఖైరతాబాద్ పెద్ద గణేశునికి ప్రత్యేక స్థానం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకే ఈ వినాయకుడు తలమానికంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.  అంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ గణేశుని నిమజ్జనం ఏటా తెల్లవారుజామున జరుగుతుంది. దానితో ఈ బడా గణేశుని నిమజ్జనమహోత్సవాన్ని కన్నులారా తిలకించే భాగ్యం దక్కేది కాదు.  అలాంటిది ఈ ఏడు మధ్యాన్నం సమయానికల్లా ఖైరతాబాద్ గణేషు విగ్రహం నిమజ్జనం విజయవంతంగా జరిగింది. మొత్తం మీద  ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. అందులోను ఈ సరి విగ్రహం చాల వరకు హుస్సేన్ సాగర్  నీట మునిపోయిదనే చెప్పాలి.



ప్రభుత్వపరంగా తీసుకున్న జాగ్రతల కారణంగానే ఈ ఏడు ఈ గణేశుని నిమజ్జనం చరిత్రకెక్కింది చెప్పవచ్చు. ఖైరతాబాద్‌ మహాగణపతిని కొన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నం.4 వద్దే నిమజ్జనం చేసేవారు. దానితో  ఈ వినాయకుడి విగ్రహం సగం మాత్రం నిమజ్జనం అవుతుండేది.  అగమ శాస్త్ర నియమాల ప్రకారం గణపతి విగ్రహాలు గంగలో పూర్తిగా నిమజ్జనం కావాలి. దీంతో ప్రభుత్వ యంత్రాంగం విగ్రహాన్ని సంపూర్ణంగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ప్రత్యేక చొరవ తీసుకొని నిమజ్జనం చేసే స్థలం మార్పు చేశారు. ఈ మేరకు డ్రోన్‌లతో సాగర్‌లో లోతు ఉన్న ప్రాంతాల డేటాను కూడా తెప్పించుకున్నారు. దీంతో క్రేన్‌ నం. 6వ వద్ద 20 అడుగులకు పైగా లోతు ఉన్నట్లు నిపుణులు సూచించడంతో అక్కడే నిమజ్జనం చేసేందుకు నిర్ణయించారు.

  



ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన గణేషుడి శోభాయాత్ర ఎన్టీఆర్ మార్గ్ వరకు సుమారు ఐదు గంటల పాటు కొనసాగింది.61 అడుగుల ఎత్తు, 45 టన్నుల బరువున్న మహాగణపతిని నిమజ్జనం చేసేందుకు 400 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్‌ను ఉపయోగించారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో అర్చకులు గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్-6 వద్ద మహాగణపతిని నిమజ్జనం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: