అవును మన ఉగాది దేశానికి ఆదర్శం. ఉగాది సాంప్రదాయాలు, ఉగాది నాడు చేసే కార్యక్రమాలు, ప్రజలు అనుసరించే విధానాలు, ఉగాది పచ్చడి ఇలా అన్నీ కూడా దేశానికి ఆదర్శంగా నిలిచాయి. ఉగాది పచ్చడి దేశానికి చాలా నేర్పింది. ఉగాది పచ్చడి రుచి అనేది ఎవరూ చెప్పలేరు. రకరకాల రుచులలో ఉంటుంది ఆ పచ్చడి. అందుకే ఉగాది పచ్చడి అనేది జీవితాన్ను నేర్పిస్తుంది అనే వారు ఉన్నారు. 

 

ఉగాది పచ్చడి ద్వారా మనం ఎన్నో నేర్చుకోవచ్చు. జీవితం అనేది కష్టాలు సుఖాలు, బాధలు, కన్నీళ్ళ తో ఎలా ఉంటుందో ఉగాది పచ్చడి లో కూడా అనేక రుచులు ఉంటాయి. చేదు, పులుపు కారం ఇలా అన్నీ ఉంటాయి. వగరు కూడా ఉంటుంది. ఉగాది పచ్చడి రుచి కొందరికి నచ్చుతుంది కొందరికి కొత్తగా ఉంటుంది. ఉగాది రోజు చేసే కార్యక్రమాలు కూడా దేశానికి చాలా నేర్పాయి. 

 

చలివేంద్రాలు ప్రారంభించడం, గో పూజను ఆ రోజు చేయడం దేవుడికి పెట్టే నైవేద్యాలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఆదర్శమే. అందుకే ఉగాది పండగ నుంచి దేశం చాలా నేర్చుకోవచ్చు. ఈ ఉగాది దేశంలో అన్ని ప్రాంతాల్లో తెలుగు వారు నిర్వహిస్తారు. వారి ద్వారా ఇతరులు కూడా చాలా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఉగాది గొప్పది అంటారు. ఆ సాంప్రదాయం కూడా చాలా అందంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: