ఉగాది విషయంలో మన తెలుగు వాళ్ళు ఎక్కడా వెనకాడే పరిస్థితి ఉండదు. తెలుగు ఏడాది ప్రారంభం కాబట్టి అందరూ కూడా ఉగాదిని జరుపుకుంటున్నారు. మతాలకు, కులాలకు సంబంధం లేకుండా ఉగాది పండగ జరుగుతుంది. ఈ ఏడాది కరోనా నేపధ్యంలో ఉగాది పండగ చాలా తక్కువగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కర్ఫ్యూ తరహా వాతావరణం ఉన్న నేపధ్యలో అందరూ కూడా ఇంటికి పరమితం అవుతున్నారు. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఉగాది పచ్చడికి కావాల్సిన వస్తువుల ధరలు భారీగానే ఉన్నాయి. మామిడి కాయ ఒక్కొకటి 50 రూపాయల వరకు ఉంది. వేప పువ్వుని కూడా ధరను పెంచి అమ్ముతున్నారు. అరటి పళ్ళు, చెరుకు సహా కొన్ని ధరలు భారీగా పెరిగాయి. బెల్లం ఇలా కొన్ని ధరలు భారీగా ఉన్నాయి. హైదరాబాద్ లో వీటి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మామిడి ధరలు బాగా పెరిగాయి. 

 

కొబ్బరి కాయ ధర కూడా భారీగా పెరిగింది. ఒక్కొక్కటి 50 రూపాయల వరకు అమ్ముతున్నారు. పువ్వుల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఉగాదిని అడ్డం పెట్టుకుని కొందరు వ్యాపారులు చెలరేగిపోతున్నారు. చివరికి వేపాకులు, మామిడి ఆకులు కూడా అధిక ధరలకు అమ్ముతున్నారు కొందరు. దీనితో ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: