హిందూమత విశ్వాసాల ప్రకారం దేవుళ్లకు నైవేద్యం సమర్పించడం వల్ల తమకు అన్ని శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతూ ఉంటారు . చాలామంది ఆ కారణంగానే ప్రతిరోజు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నైవేద్యం చేసి పెడుతూ సంతృప్తి పడుతూ ఉంటారు . కాగా ఈ నేపథ్యంలో ఏ ఆలయానికి వెళ్లిన ఇంట్లో ఏ పూజ చేసిన ముందుగా అందరూ కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పటినుంచో పాటిస్తూ వస్తున్నారు.  ఇది ఒక ఆనవాయితీలా వస్తుంది. అసలు కొబ్బరికాయ లేకుండా ఏ పూజ కూడా పూర్తికాదు . అందుకే ప్రతి ఒక్కరు కూడా ఏ పూజ చేసిన లేకపోతే శుభకార్యం చేసిన ముందుగా కొబ్బరికాయను కచ్చితంగా పూజలకు ఉపయోగిస్తారు.


ఇలా దేవుడికి కొబ్బరికాయ కొట్టడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని పండితులు కూడా చెబుతూ వస్తున్నారు. అయితే ఇలా పూజలో ఉపయోగించిన కొబ్బరికాయను కొట్టిన తర్వాత చాలామంది ఆ కొబ్బరికాయను రకరకాలుగా వాడుతూ ఉంటారు . కొంతమంది పచ్చళ్ళు అని ..మరి కొంతమంది పొడులు అని..  మరి కొంతమంది ఏకంగా మాంసాహారాల్లోకి మసాలా అని.. ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు . అయితే అది మహా మహా పాపం అంటున్నారు పండితులు.  పూజలోకి ఉపయోగించిన కొబ్బరికాయను ఈ విధంగా మాంసాహారాలలో ఉపయోగించడం లాంటివి చేయకూడదు అని సూచిస్తున్నారు.



పూజలో ఉపయోగించిన కొబ్బరికాయను కేవలం తీపి పదార్థాలు చేసుకునేందుకు మాత్రమే ఉపయోగించాలి అని.. లేకపోతే ఆ కొబ్బరికాయను అలాగే పచ్చిగా నాలి కానీ ఇలా మాంసాహారాలలో ఉపయోగించే మసాలాల కోసం వాడకూడదు అని పండితులు చెప్పుకొస్తున్నారు . అలా చేస్తే అది జన్మజన్మల పాపమని పూజ ఫలితం దక్కదు అని చెప్పుకొస్తున్నారు, అయితే చాలామంది పూజలో కొట్టిన కొబ్బరికాయతో ఎక్కువగా మసాలాలు ..పచ్చళ్ళు.. పొడిలు చేసుకుంటూ ఉంటారు. ఎవరో రేర్ గా మాత్రమే కలశంలో పెట్టిన కొబ్బరికాయను పూజకు ఉపయోగించిన కొబ్బరికాయను ఇలా తీపి పదార్థాలు చేసి వినియోగించుకుంటూ ఉంటారు.  ఇకనైనా వాళ్లు మారితే బాగుంటుంది అంటున్నారు జనాలు . అంతేకాదు మీరు ఎంతో కష్టపడి చేసిన పూజ ఫలితం మీకు దక్కాలి అంటే ఇలాంటివి పాటించాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు.



గమనిక : ఇక్కడ అందించిన సమాచారం ఒక అవగాహన కోసం మాత్రమే . పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాల పై ఆధారపడి ఉంటాయి . ఇది కేవలం కొందరు పండితుల చెప్పిన సమాచారం ప్రకారం మాత్రమే ఇవ్వబడింది . దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు .ఎవరి వ్యక్తిగత ఒపీనియన్ వాళ్లకు ఉంటుంది అని గుర్తుంచుకోవాలి పాఠకులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: