హిందూ విశ్వోద్భవ సిద్ధాంతం లో కాలాన్ని ఒక చక్రంగా పరిగణిస్తారు . దీనిని "మహాయుగం" లేదా "చతుర్ యుగం" అంటారు . ఇది నాలుగు యుగాల సమాహారం తో కూడిన విశ్వ కాల చక్రం . అవి - సత్య యుగం , త్రేతా యుగం , ద్వాపర యుగం , కలియుగం . ఒక మహాయుగం మొత్తం 4,320,000 మానవ సంవత్సరాలు ఉంటుంది . దీన్ని 12,000 దైవిక సంవత్సరాలు గా కూడా పిలుస్తారు , ఎందుకంటే హిందూ గణన ప్రకారం 1 దైవిక సంవత్సరం = 360 మానవ సంవత్సరాలు . ఈ యుగాలు అనంతంగా పునరావృతమవుతాయి , ఇది విశ్వం యొక్క చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది.


సత్య యుగం (కృత యుగం) :
ఈ యుగం 1,728,000 సంవత్సరాలు కొనసాగుతుంది . ధర్మం నాలుగు పాదాల పై నిలుస్తుంది . ఇది స్వర్ణయుగం . మానవుల సగటు ఎత్తు 32 అడుగులు. పరిపూర్ణత , సత్యం , నైతికత అన్నీ ఫూల్ స్కేల్లో కనిపిస్తాయి .

త్రేతా యుగం :
1,296,000 సంవత్సరాలపాటు నడిచే ఈ యుగంలో ధర్మం 3 పాదాలపై నడుస్తుంది. మానవుల ఎత్తు సగటున 21 అడుగులు. శ్రీరాముడి కాలం ఇది. ధర్మంలో కొంత క్షీణత మొదలవుతుంది.

ద్వాపర యుగం :
864,000 సంవత్సరాలు పాటు కొనసాగే ద్వాపర యుగంలో ధర్మం 2 పాదాలపై నిలుస్తుంది. భౌతికవాదం పెరుగుతుంది. మానవుల ఎత్తు 7-14 అడుగుల మధ్య ఉంటుంది. కృష్ణుడు ఈ యుగంలో అవతరించారు.

కలియుగం :
ఇది ఇప్పటి యుగం. మొత్తం 432,000 సంవత్సరాలపాటు ఉంటుంది. 2025 నాటికి ఇది 5,126 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 426,874 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ధర్మం ఒక్క పాదంపై మాత్రమే నిలుస్తుంది. ఈ యుగం చివర్లో విష్ణువు కల్కి అవతారంగా అవతరిస్తారు. అప్పుడు మరో మహాయుగ చక్రం ప్రారంభమవుతుంది.

ఈ యుగ చక్రం హిందూ ధర్మంలో సమయాన్ని, నైతికతను, విశ్వం పరిణామాన్ని అర్థం చేసుకునే గొప్ప మార్గంగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: