టీమ్ ఇండియా డేర్ అండ్ డాషింగ్  కెప్టెన్... పరుగుల యంత్రం... రికార్డుల రారాజు ఇలా చెప్పుకుంటూ పోతే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి ఎన్ని అవార్డులు అయినా ఇవ్వచ్చు. ఇప్పటివరకు కోహ్లీ బ్రేక్ చేసిన రికార్డులు ఎన్నో. ఎందరో క్రికెట్ లెజెండ్స్ సృష్టించిన రికార్డులన్ని  కోహ్లీ బద్దలు కొడుతూ దూసుకుపోతున్నాడు. ఒకసారి బ్యాట్  పడితే ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారాల్సిందే.ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్న కోహ్లీ.... రికార్డులను బద్దలు కొడుతూ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. ఎన్ని పరుగులు తీసిన... ఎన్ని రికార్డులు బ్రేక్ చేసిన కోహ్లీ కసి  మాత్రం తీరేలా లేదు. అందుకే ఏ మ్యాచ్ లో అయినా డు ఆర్ డై మ్యాచ్  అన్నట్టుగా విరాట్ ఆట కనిపిస్తుంది. అయితే తాజాగా విరాట్ మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20,  వన్డే,  టెస్ట్ ఇలా మూడు ఫార్మాట్లలో 50కి పైగా యావరేజ్  సాధించి చరిత్ర సృష్టించాడు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ. మొహాలీలో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఈ అరుదైన ఘనతను సాధించాడు విరాట్ కోహ్లీ. దీంతో కోహ్లి రికార్డును ఐసీసీ ట్వీట్ చేసి అభినందనలు తెలిపింది. దీంతో క్రికెటర్లు అందరూ కోహ్లీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా ట్విట్టర్ ద్వారా కోహ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు. గొప్ప ఆటగాడైనా కోహ్లీ సక్సెస్ ఇలాగే కొనసాగాలని ఆఫ్రిది ఆకాంక్షించాడు. క్రికెట్ అభిమానులకు కోహ్లీ ఎప్పుడు వినోదం అందించాలని ఆఫ్రిదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. కాగా  ఆఫ్రిది ,  కోహ్లీ ఆన్ ఫీల్డ్ లో ఎన్నో సార్లు గొడవపడ్డ విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: