ఐపీఎల్ లో సరికొత్తగా ఉండనుంది. ఈ పదమూడవ సీజన్ మరింత కొత్తగా మన ముందుకు రానుంది. ఇప్పటికే ఇప్పటికే ‘పవర్‌ ప్లేయర్‌’ అనే కొత్త ప్రతిపాదన గవర్నింగ్‌ కౌన్సిల్‌ ముందుకు వచ్చింది. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తుది నిర్ణయమని బీసీసీఐ అధికారి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా మరో ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ఐపీఎల్  క్రికెట్ లో ఒక్కోసారి లో అంపైర్ ల తప్పుడు నిర్ణయాల వల్ల టీమ్స్ నష్టపోతున్నాయనే ఉద్దేశ్యంతో మరో సరికొత్త నిర్ణయం తెరమీదకి వచ్చింది.  


గత ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ లో లసిత్ మలింగ నోబాల్ వేసినప్పటికీ దాన్ని నో బాల్ గా ప్రకటించకపోవడంతో బెంగళూరు ఓటమి పాలైంది. ఒకవేళ అది నో బాల్ గా ప్రకటించి ఉంటే బెంగళూరు గెలిచి ఉండేదేమో. అంఫైర్ తప్పుడు నిర్ణయంపై కోహ్లీ అసహనం వ్యక్త పరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకనుండి అలాంటి తప్పులు జరగకుండా చూడడానికి మరో ఫీల్డ్ అంపైర్ ని పెట్టాలని గవర్నింగ్ కౌన్సిలింగ్ భావిస్తున్నారట. అయితే ఈ ఫీల్డ్ అంపైర్ కేవల  నో బాల్ చెక్ చేయడానికే ఉంటాడట. 


అంపైర్ల పై ఉన్న ఒత్తిడిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఫ్రంట్ ఫుట్, హైట్ నోబాల్ నిర్ణయాలను మాత్రమే తీసుకునే అధికారం ఎక్స్ ట్రా అంపైర్ ఉంటుందని బీసీసీఐకి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు. అయితే ఇది సాధ్యం అవుతుందా కాదా అనే దానిపై చర్చ జరుపుతున్నారట. ఈ ఎక్స్ ట్రా అంపైర్ కి బీసీసీఐ గంగూలీ కూడా సుముఖంగా ఉన్నాడట. అయితే దీన్ని డైరెక్ట్ గా ఐపీఎల్ లో ప్రవేశ పెట్టకుండా ప్రయోగాత్మకంగా మస్తాక్ అలీ ట్రోఫీలో పరిశీలిస్తారని సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: