ఇండియన్ విమెన్ క్రికెటర్ షఫాలీ వర్మ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో అర్ధశతకం సాధించిన అత్యంత పిన్నవయస్కులైన భారతీయ క్రికెటర్ గా సంచలనం సృష్టించింది. ఇప్పటి వరకూ ఈ రికార్డు క్రికెట్ గాడ్ గా చెప్పుకునే సచిన్ పేరిట ఉండేది.

దాదాపు 30ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఈ రికార్డును 15 ఏళ్ల షఫాలీ బద్దలు కొట్టేసింది.

సచిన్ 16ఏళ్ల 214 రోజుల వయసులో హాఫ్ సెంచరీ కొడితే... షఫాలీ 15 ఏళ్ల 285 రోజుల వయసుకే ఆ ఘనత సాధించింది. శనివారం వెస్టిండీస్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో ఈ అద్భుతం ఆవిష్కారమైంది.

షఫాలీ 49 బంతుల్లో 73 పరుగులు చేసి ఈ ఘనత సాధించింది. షఫాలీ దూకుడుతో ఈ మ్యాచ్ లోభారత మహిళా క్రికెట్ జట్టు 84 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. షఫాలీ ఈ మ్యాచ్ లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో వెస్టిండీస్ బౌలర్లను ఉతికి ఆరేసింది. షఫాలీకి ఇది తన కెరీర్లో ఐదో టీ20 మ్యాచ్.


మరింత సమాచారం తెలుసుకోండి: