బంగ్లాదేశ్ తో జరిగిన పింక్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇండియాకిది మొట్టమొదటి పింక్ టెస్ట్ అయినప్పటికీ ఎక్కడా తడబడకుండా ప్రత్యర్థిని ముచ్చెమటలు పట్టించింది. బౌలింగ్ మాయాజాలంతో అతి తక్కువ పరుగుల వద్దే కట్టడి చేయడంతో గెలుపు సునాయాసంగా సాధ్యమైంది. రెండు టెస్ట్ సిరీస్ ల మ్యాచ్ లో భారత్ రెండు మ్యాచులు గెలిచి సిరీస్ ని గెలుచుకుంది. అటు టీ ట్వంటీ సిరీస్, టెస్ట్ సిరీస్ గెలిచి భారత టీమ్ జోరు మీదుంది.

 

అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ బీసీసీఐ అధ్యక్షుడైన గంగూలీని తన పొగడ్తలతో ముంచెత్తాడు. కోహ్లీ ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా కెప్టెన్ గా అతి తక్కువ మ్యాచుల్లో ఐదు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే గంగూలీ గురించి మాట్లాడుతూ, ఈ విజయాలన్నీ గంగూలీ వల్లే సాధ్యమయ్యాయని పేర్కొన్నాడు. 

 

తమ విజయానికి బీజం పోసింది గంగూలీయేనని 2000 సంవత్సరం మొదలుకుని గంగూలీ సారథ్యంలోనే భారత్ విజయాలను చూస్తొందని, ఆ విజయ పరంపరను మేము ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నాడు. భారత టీమ్ గంగూలీ సారథ్యంలో ఎన్నో విజయాలు చూసిన మాట వాస్తవం. అయితే అంతకుముందు టీమిండియా మ్యాచులు గెలవలేదనడమే ఇప్పుడు విమర్శలకి గురైంది. కోహ్లీ మాటలని  సీనియర్ ఆటగాడు గవాస్కర్ తప్పు బట్టాడు. 

 

గవాస్కర్ మాట్లాడుతూ 2000 సంవత్సరం నుండే భారత్ విజయాలను అందుకుందని చెప్పడం సరికాదని, అంతకుమునుపు  కూడా భారత్ ఎన్నో విజయాలని చూసిందని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ, గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడైన మూలంగా కోహ్లీ మాట్లాడి ఉండోచ్చు. కానీ 1970, 80ల్లోనే భారత్ ఎన్నో విజయాలను నమోదు చేసింది.అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్‌ల డ్రా చేసుకుంది. 1986 లోనూ గెలుపొందింది. ఇతర జట్లలాగే ఓటమిపాలైంది’. అప్పటికీ కోహ్లీ పుట్ట లేదని, అందుకే తనకి తెలిసి ఉండదని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: