తన సినిమాలు హిందీలోకి డబ్బింగ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సౌత్ లోనే కాదు హిందీలోనూ ఫ్యాన్స్ ను  సొంతం చేసుకుంటున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఫ్యాన్స్ జాబితాలో నేనుకూడా వున్నానంటున్నాడు టీమిండియా క్రికెటర్  రాహుల్ శర్మ... ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ.. మీ సినిమాలన్నీ సోనీ మ్యాక్స్ లో చూస్తాను మీరు నా ఫేవరేట్ అని రాహుల్ శర్మ ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా బన్ని థాంక్యూ వెరీ మచ్ అని రిప్లై ఇచ్చాడు. 
 
 
 
ఇక రాహుల్ శర్మ విషయానికివస్తే  ఐపీఎల్  ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ పంజాబీ స్పిన్నర్ 2011 లో పూణే వారియర్స్ తరుపున అద్భుత ప్రదర్శన చేయడం తో అదే ఏడాది టీంఇండియాలో క్లి కూడా ఎంట్రీ ఇచ్చాడు అయితే  అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చేయ లేకపోవడంతో రాహుల్ శర్మ కేవలం నాలుగు వన్డే లు రెండు టీ 20 ల తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.కానీ ఐపీఎల్ లో మాత్రం 2015 దాక కొనసాగాడు. ప్రస్తుతం ఈ 33 ఏళ్ళ ఆటగాడు దేశవాళీ క్రికెట్ లో కూడా అంత యాక్టీవ్ గా లేడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: