భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి టీ20ల్లో బౌలింగ్ చేయడం చాలా కష్టం అని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవీంద్రన్ అశ్విన్ అంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా దేశంలో సినీ స్టార్లు మరియు సెలబ్రిటీలు తమ ఇళ్ల కే పరిమితమయ్యారు. ప్రస్తుతం లాక్ డౌన్  కారణంగా ఇంటి వద్దే సమయం గడుపుతున్నా రవీంద్రన్ అశ్విన్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉన్నాడు. తన అభిమానులు అడిగిన సరదా ప్రశ్నలకి జవాబు ఇచ్చే పనిలో పడ్డాడు. ఈ సందర్భంగా ఓ నెటిజెన్ ''టీ20ల్లో ఎవరికీ బౌలింగ్ చేయడం అంటే చాలా కష్టం?'' అని ఆ అభిమాని అడుగుగా ఒక క్షణం కూడా ఆలోచించకుండా ధోని అని ఆన్సర్ ఇచ్చేశాడు.

IHG

 

దాంతో అభిమానులు ''ధోని గురించి ఇంకాస్త  చెప్పండి'' అని అభిమానులు వెంటనే మరో ప్రశ్న అడుగగా  రవీంద్రన్ అశ్విన్ సమాధానం  చెప్పాడు'' టీ-20 గొప్ప బ్యాట్స్మెన్లలో మహేందర్ సింగ్ ధోనీ కూడా   ఒకడని మరియు టీ-20 ఫార్మెట్లో అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం.. మరీ ముఖ్యంగా.... డెత్ ఓవర్లో  ధోనిని ఆపడం చాలా కష్టమని  చెప్పాడు. అయితే ధోని ఇప్పటి వరకు చూడని గొప్ప కెప్టెన్లలో ఒకడని అదేవిధంగా ఐపీఎల్ లోనూ అదే స్థాయిని అతను అంధుకున్నాడని. భారత్ కీ 2007 టీ-20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ లను అందించిన ఘనత ధోని కే దక్కుతుంది.

IHG

 

అదేవిధంగా ఐపీఎల్ చెన్నైకి వరుసగా మూడు టైటిల్స్ ని అందించాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో సుదీర్ఘ కాలం టీమిండియాలో ఆడడం గొప్పగా భావిస్తున్నాను అని అశ్విన్ అన్నాడు. ఐపీఎల్  లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన అశ్విన్ తరువాత పంజాబ్ టీమ్ కు మల్లి పంజాబ్ టీమ్ నుండి ఢిల్లీ క్యాపిటల్స్ కి మారాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సంవత్సరం ఐపీఎల్ ఆగిపోయిన సంగతి తెలిసిందే......

మరింత సమాచారం తెలుసుకోండి: