ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య క్రికెట్ ప్రేక్షకులందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేస్తుంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి నేటి వరకు కూడా ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. కాగా నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.  అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది. ఎప్పుడు తమ ప్రదర్శనతో డిఫెండింగ్ చాంపియన్ గా పేరు తెచ్చుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈసారి మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది అని చెప్పాలి.



 ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగింటిలో ఓడిపోయింది అయితే తమకు ఎప్పుడూ అచ్చిరాని ఛేజింగ్ ను హైదరాబాద్ ఐదు సార్లు చేయడం గమనార్హం. ప్రతి మ్యాచ్లో కూడా లక్ష్యానికి దగ్గరగా వచ్చి మ్యాచ్లు చేజార్చుకుంది. ముఖ్యంగా ఢిల్లీ కాపిటల్స్ జట్టుతో నిన్న జరిగిన మ్యాచ్ లో ఇక దాదాపు సన్ రైజర్స్ గెలుస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మ్యాచ్ టై అయింది. చివరికి సూపర్ ఓవర్ లో ఫలితం వచ్చింది. ఇక సూపర్ ఓవర్ లో చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. అయితే చివరి మూడు బంతుల్లో 4 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం 3 పరుగులు చేసింది సన్రైజర్స్ .



 అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోవడానికి అటు జట్టు కెప్టెన్ తీసుకున్న నిర్ణయాలే కారణం అని చెబుతున్నారు క్రికెట్ విశ్లేషకులు. మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అనుభవం లేని విరాట్ సింగ్ ను పంపడం ద్వారా ఓవైపు దూకుడు మీద ఆడుతున్న కేన్ విలియమ్సన్ పై ఎంతగానో ఒత్తిడి పెరిగిందని అదే సమయంలో విరాట్ సింగ్ దూకుడుగా ఆడాల్సింది పోయి 14 బంతుల్లో నాలుగు పరుగులు చేయడంతో రన్ రేట్ తగ్గిపోవడంతో ఇక విలియమ్సన్ పై మరింత ఒత్తిడి లో మునిగిపోయాడు అంటూ చెబుతున్నారు. ఇక మరోవైపు వార్నర్ లేని పరుగు కోసం ప్రయత్నించి రన్నవుట్ అయ్యాడు. సీనియర్ మనిషి పాండే, దూకుడుగా ఆడే సమద్ లాంటి ఆటగాళ్లను కాదని  అప్పుడు వరకు తమను తాము నిరూపించుకోని ఆటగాళ్లకు అవకాశం ఇవ్వటం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని అంటున్నారు. అంతేకాకుండా సూపర్ ఓవర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న బెయిర్ స్ట్రో కి బదులు వార్నర్ స్వయంగా బరిలోకి దిగడం కూడా అందరిని ఆశ్చర్యపరిచింది. ఇలాంటి తప్పులు వల్లే సన్రైజర్స్ ఓడిపోవాల్సి వచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: