గత కొంత కాలం నుంచి టీమిండియాను కరోనా వైరస్ వెంటాడుతుంది. అయితే కఠినమైన నిబంధనలు మధ్య ప్రస్తుతం ఆటగాళ్లతో పాటు సిబ్బందిని కూడా ఉంచి నప్పటికీ ఏదో విధంగా బయో బబుల్లోకి కరోనా వైరస్ ప్రవేశించి సోకుతుంది. ఈ క్రమంలోనే అటు మొన్నటికిమొన్న శ్రీలంక పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు లో కూడా కరోనా వైరస్ కలకలం సృష్టించింది.  ఇక ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టులో కూడా పలువురు ఆటగాళ్లు కరోనా వైరస్  బారిన పడడం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 ఇలా కరోనా వైరస్ అటు టీమిండియాను వెంటాడుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఏకంగా కోచ్ రావిశాస్త్రి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.  ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షల్లో రావిశాస్త్రికి పాజిటివ్ వచ్చినట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి రవి శాస్త్రి తో సన్నిహితంగా ఉన్న టీమిండియా స్టాఫ్ అందరిని కూడా ఐ సొల్యూషన్ లోకి పంపింది టీమిండియా. ప్రస్తుతం హెడ్ కోచ్ రావిశాస్త్రి తో పాటు బౌలింగ్ కోచ్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్ నితిన్ పటేల్ కూడా ఐసోలేషన్ లో కి వెళ్లినట్లు బీసీసీఐ తెలిపింది.



 ఆర్ టి పి సి ఆర్ టెస్టులో రవి శాస్త్రి కి సంబంధించిన రిపోర్టులు వచ్చేంత వరకు కూడా వీరందరూ ఐసోలేషన్ లోనే ఉంటారూ అంటూ బిసిసిఐ స్పష్టం చేసింది. అయితే అదే సమయంలో మిగతా ఆటగాళ్లు అందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ రావడంతో వారిని భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ కి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది బిసిసీఐ. ఇకపోతే ప్రస్తుతం భారత్ టీమిండియా మధ్య  నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఇక చెరొక మ్యాచ్ గెలిచిన భారత్ ఇంగ్లాండ్ జట్లు  పాయింట్ల పట్టికలో సమంగా కొనసాగుతున్నాయి. ఇక నాలుగవ జట్టు లో గెలిచి ఎవరు ఆధిపత్యాన్ని సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: