నిన్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. పాకిస్తాన్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరిగింది. చివరి వరకు కూడా ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఊహకందని విధంగా మారిపోయింది. అయితే మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఆస్ట్రేలియా ముందు ఉంచింది. ఈ క్రమంలోనే భారీ లక్ష్య చేదనకు బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు మొదట్లోనే తడబడింది. మొదటి ఓవర్ లోనే వికెట్ కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఎంతో ఇబ్బందిగా పరుగులు చేసింది. కానీ డేవిడ్ వార్నర్ బాగా రాణించడంతో ఆస్ట్రేలియా  నిర్ణీత ఓవర్లలో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక ఒకానొక సమయంలో పాకిస్తాన్ బౌలర్లు వరుసగా వికెట్లు తీశారు.  ఆస్ట్రేలియాపై పట్టు బిగిస్తున్నట్లు కనిపించారు.


 ఈ క్రమంలోనే ఇక పాకిస్థాన్ జట్టు గెలిచే మ్యాచ్ ఓడిపోయింది అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకొచ్చిన పాకిస్థాన్ సెమీ ఫైనల్లో తడబడింది. చివరికి ఓడిపోయి ఇంటి బాట పట్టింది. అయితే సెమీఫైనల్లో గెలవాల్సిన పాకిస్థాన్ జట్టు ఓడిపోవడానికి ఒకే ఒక్క కారణం అన్నది అందరికీ తెలిసిందే. అప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్నాడు మాత్యు హెడ్.. అలాంటి ఆటగాడు 19వ ఓవర్లో క్యాచ్ ఇవ్వగా బౌండరీ దగ్గర ఉన్నా  పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ క్యాచ్ మిస్ చేశాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే పాకిస్థాన్ జట్టు గెలిచి ఫైనల్ వెళ్లే  అవకాశం ఉండేది. అతను ఆ క్యాచ్ మిస్ చేయడంతో ఆ తర్వాత విజృంభించిన మాత్యు హెడ్ 3 సిక్సర్లు కొట్టాడు.



 దీంతో గెలవాల్సిన పాకిస్తాన్ కాస్త ఓటమి పాలు అయింది. అయితే పాకిస్తాన్ బౌలర్  హసన్ అలీ క్యాచ్ మిస్ చేయడంపై ప్రస్తుతం పాక్ క్రికెట్ అభిమానులు రెచ్చిపోతున్నారు. పాకిస్తాన్ జట్టు అతని వల్లే ఫైనల్  చేరలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొంతమంది అభిమానులు అయితే మరింత రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా దూషిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు. అయితే కేవలం హసన్ అలీ మాత్రమే కాదు అతని భార్యను కూడా ఈ వ్యవహారంలో కి లాగి బూతులు తిడుతూ ఉండడం గమనార్హం. ఇలా పాకిస్తాన్ ఫాన్స్ తీరు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: