అయితే సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.ఎంతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో అన్ని సందర్భాల్లో కూడా పాకిస్తాన్ జట్టు విజయం సాధిస్తుంది అనే విధంగానే ఉంది పరిస్థితి. కానీ పాకిస్థాన్ ఆటగాడు హసన్ అలీ చేసిన చిన్న తప్పిదం ఏకంగా జట్టుకు శాపంగా మారిపోయింది. క్రీజులోకి వచ్చి ఎంతో దూకుడుగా ఆడుతున్న మాత్యు వెడ్ క్యాచ్ ఇచ్చిన సందర్భంలో ఇక ఒత్తిడితో క్యాచ్ మిస్ చేశాడు పాకిస్తాన్ బౌలర్ హసన్ అలీ. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్న ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ వరుసగా సిక్సర్ల మోత మోగించాడు.
దీంతో ఓడిపోతుంది అనుకున్న ఆస్ట్రేలియా జట్టు కాస్త విజయం సాధించింది. అయితే హసన్ అలీ కారణంగానే పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్లో ఓడిపోయింది అంటూ పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే హసన్ అలీ తో పాటు అతని భార్య ని కూడా ఈ వ్యవహారంలో లాగి దారుణంగా సోషల్ మీడియా వేదికగా బూతులు తిట్టడం కూడా మొదలుపెట్టారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ బౌలర్ స్పందించాడు. ఫాన్స్ అందరికీ కూడా బహిరంగ క్షమాపణలు చెప్పాడు. అభిమానుల అంచనాలను అందుకోవడంలో తాను విఫలం అయ్యాను.. తను ఈ ఓటమి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. ఇకపై ఉత్తమ ప్రదర్శన చేస్తాను అంటూ హసన్ అలీ బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి