పాకిస్థాన్ క్రికెటర్లు ఇఫ్టికార్ అహ్మద్, మొహమ్మద్ హాస్నాన్ లు చేసిన పని కాస్త ప్రస్తుతం పాకిస్థాన్ జట్టును ట్రోల్ చేసేలా చేస్తుంది. ఇద్దరు ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపం కారణంగా చివరికి ఎంతో అరుదైన క్యాచ్ ను వదిలేశారు. ఇక వదిలేసిన తర్వాత సైలెంట్ గా ఊరుకోకుండా క్యాచ్ పట్టకపోవడంలో తప్పు నీది అంటే నీది అంటూ వాదన చేసుకున్నారు. ఇలా ఇటీవలే ఈ ఇద్దరు క్రికెటర్లు చేసిన తప్పు కాస్త వైరల్ గా మారిపోతుంది. అయితే ఇంత చిన్న తప్పు అంత హాట్ టాపిక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటారా.. అయితే అచ్చంగా 13 ఏళ్ల కిందట ఇలాంటి ఘటనే జరిగింది
ఇదే ప్రస్తుతం ట్రోల్ చేయడానికి కారణం గా మారిపోయింది. 2008లో అచ్చం ఇలాంటి తరహాలోనే షోయబ్ మాలిక్, సయిద్ అజ్మల్ లు క్యాచ్ పట్టుకునేందుకు వెళ్లగా సమన్వయ లోపంతో ఒకరు పడతారని మరొకరు ఇద్దరూ క్యాష్ వదిలేశారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే అప్పుడు ఇదే సీన్ జరిగినప్పుడు పాకిస్తాన్ వెస్టిండీస్ జట్టు తోనే మ్యాచ్ ఆడుతూ ఉంటే.. ఇక ఇప్పుడు కూడా వెస్టిండీస్ పాకిస్తాన్ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇద్దరు పాకిస్థాన్ ఆటగాళ్లు 2.0 అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. ఇక ఇలాంటి చరిత్రను తిరగ రాయడం అంటే అది కేవలం పాకిస్థాన్ క్రికెటర్లకు మాత్రమే సాధ్యమవుతుంది కామెంట్లు కూడా పెడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి