భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనపైనే  అందరి దృష్టి ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఒక్కసారి కూడా భారత జట్టు టెస్ట్ సిరీస్ గెలిచిన దాఖలాలు లేవు. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తుండడంతో ఇక ఈ సారి కోహ్లీ సేన టెస్ట్ సిరీస్ లో విజయం సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే సెంచరియన్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది అంటే చాలు ఇక టీమిండియాకు ఎంతగానో ఆత్మవిశ్వాసం వచ్చే అవకాశం ఉంది అని క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం వ్యక్తం చేశారు.


 అయితే బ్యాటింగ్ కు దిగిన టీమిండియా రెండు ఇన్నింగ్స్ లో కూడా అద్భుతంగా రాణించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత అటు బౌలింగ్ విభాగం కూడా అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే తక్కువ పరుగులకే అటు సౌత్ ఆఫ్రికా టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ చేయగలిగింది టీమిండియా. ఇటీవలే 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది సౌత్ ఆఫ్రికా. ఈ క్రమంలోనే ఎల్గర్ రూపంలో కీలక వికెట్ కోల్పోయింది. దీంతో సౌత్ ఆఫ్రికా పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది అని చెప్పాలి. ఏడు వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా 182 పరుగులు మాత్రమే చేసింది. బావుమా (34), మార్కో జాన్‌సెన్‌ (5) కూడా తక్కువ పరుగులకే వికెట్ చేజార్చుకున్నారు. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే  భారీగా పరుగులు చేయాల్సిన  ఈ సమయంలో  సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు.


 దీంతో భారీ పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 113 పరుగుల తేడాతో టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గడ్డపై ప్రోటీస్ జట్టుపై విజయం సాధించడం గమనార్హం ఈ క్రమంలోనే భారత జట్టు అభిమానులు కూడా ఎంతగానో ఆనందంలో మునిగిపోయారు. ఇక సౌత్ ఆఫ్రికా గడ్డపై భారత జట్టు గెలుస్తుందా లేదా అనే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో కోహ్లీ సేన సమిష్టిగా రాణించి మంచి విజయం సాధించింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు భారత అభిమానులు. మొదటి మ్యాచ్ విజయంతో  టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో తర్వాత మ్యాచులో కూడా విజయం సాధించే అవకాశం ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: