ఆ తర్వాత కేవలం టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్గా పరిమితమైన విరాట్ కోహ్లీ ఇక చివరి టెస్టు ఫార్మాట్ కు కెప్టెన్గా గుడ్ బై చెప్పేసాడు. ఇక ఇక కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అయితే కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు తీసుకున్న నిర్ణయం పై మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ చెప్పి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు అంటూ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్ చేశాడు.. ఇక కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల కోహ్లీ బ్యాట్స్మెన్గా మరింత పూర్తి స్వేచ్ఛ తో ఆడే అవకాశం ఉందని పేర్కొన్నాడు రవిశాస్త్రి. కెప్టెన్గా తన భుజాలపై ఉన్న భారాన్ని దించుకున్నాడు. ప్రస్తుతం అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. కొంతకాలం పాటు టెస్ట్ కెప్టెన్సీ గా ఉండి ఉంటే బాగుండేది. ఏదేమైనా అతని అది వ్యక్తిగత విషయం గౌరవించాల్సిందే.
క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉన్న భారత్ లో అన్ని ఫార్మాట్లకు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టడం అంత సులభం కాదు. వేరే ఏ జట్టు కెప్టెన్ పైన లేనంత ఒత్తిడి భారత కెప్టెన్ పై ఉంటుంది. కెప్టెన్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు భారత్ అభిమానులు. ఇక కోహ్లీ లాంటి ఆటగాడు జట్టును నడిపిస్తుంటే అంచనాలు మరింత పెరిగి పోతూ ఉంటాయి అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. కోహ్లీ వ్యక్తిగత ప్రదర్శన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో అతని సత్తా ఏంటో నిరూపించుకున్నాడు అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్లో ఓపెనర్గా బరిలోకి దిగుతాడా.. మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడ అన్నది జట్టు బ్యాలెన్స్ పై ఆధారపడి ఉంటుంది అని చెప్పుకొచ్చాడు రవి శాస్త్రి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి