మీరు మారిపోయారు సార్.. మొత్తం మారిపోయారు.. మీకు తిరుగులేదు అంతే.. అంటూ ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి సరికొత్తగా ప్రస్థానం మొదలు పెట్టింది. గత కొన్ని సీజన్స్ నుంచి పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తుంది. కనీసం ఏ మ్యాచ్ లో కూడా సరిగ్గా విజయాన్ని సాధించ లేదు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ ఈసారి మెగా వేలంలో కొత్త ఆటగాళ్ళను జట్టులోకి తీసుకోవడంతో  సన్రైజర్స్ కు తిరుగు ఉండదు అని అందరు అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో 2022 ఐపీఎల్ సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయింది సన్రైజర్స్ హైదరాబాద్.



 ఇక ఆ తర్వాత కూడా అదే రీతిలో ఓటముల పరంపర కొనసాగిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ ని ఓడించింది సన్రైజర్స్. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడింది.  ఈ క్రమంలోనే రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని అభిమానులు అందరూ ఎంతో ఉత్కంఠగా మ్యాచ్ వీక్షించారు.



 ఈ క్రమంలోనే బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో అద్భుతంగా రాణించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘన విజయాన్ని సాధించడం గమనార్హం. దీంతో 2022 ఐపీఎల్ సీజన్ లో మొదటిసారి హ్యాట్రిక్ కొట్టింది సన్రైజర్స్ హైదరాబాద్. 176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్  17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. ఈ క్రమంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ విజయంలో రాహుల్ ప్రీతి పార్టీ 71 మార్కరం 68 కీలక పాత్ర వహించారు.  హైదరాబాద్ హ్యాట్రిక్  విజయం సాధించడం పట్ల అభిమానులందరూ ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: