ఇలా ఇప్పటి వరకు ఎంతోమంది టీ-20 ఫార్మెట్లో ఆధిపత్యం చెలాయించి అరుదైన రికార్డులు సాధించిన బౌలర్లు ఉన్నారు. ఇక బిసిసిఐ ప్రతియేడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో కూడా బ్యాట్మెన్ పై పూర్తి ఆదిపత్యాన్ని సాధించిన వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్లు కూడా చాలామంది ఉన్నారు. అద్భుతమైన బౌలింగ్తో జట్టు విజయంలో కీలక పాత్ర వహించడమే కాదు రికార్డులు కొల్లగొట్టారు ఆయా బౌలర్. ఇలా ఐపీఎల్ లో వేగంగా వంద వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు శ్రీలంక ప్లేయర్ లసిత్ మలింగ మొదటి స్థానంలో ఉన్నాడు.
కేవలం 70 మ్యాచ్ లలోనే 100 వికెట్లు తీసిన వీరుడిగా కొనసాగుతూ ఉన్నాడు. లసిత్ మలింగా బౌలింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆ తర్వాత సన్రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 81 మ్యాచ్ లలో వంద వికెట్లు తీసిన బౌలర్ గా రెండో స్థానంలో ఉన్నాడు. రషీద్ ఖాన్ 83 మ్యాచ్ లలో వంద వికెట్ల మార్కును అందుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ 83 మ్యాచ్ లలో 100 వికెట్లు తీశాడు ఆశిష్ నెహ్రా 83 మ్యాచ్ లలోనే 100 వికెట్లు పడగొట్టాడు. ఇక అమిత్ మిశ్రా 83 మ్యాచుల్లో వంద వికెట్లు మార్క్ ని అందుకోవడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి