ఈ ఏడాది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత పేలవంగా ప్రస్థానం మొదలు పెట్టింది అన్న విషయం తెలిసిందే. మెగా వేలం కారణంగా జట్టులోకి కొత్త ఆటగాళ్లను తీసుకుంది. ఈ క్రమంలోనే అద్భుతంగా రాణిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మొదటి రెండు మ్యాచ్ లలో కూడా ఘోర ఓటమి చవిచూసి అందరిని నిరాశపరిచింది. సన్రైజర్స్ ఆటతీరు ఇప్పట్లో మారడం కష్టమే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. అలాంటి సమయంలోనే వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఓటమి రుచి చూపించి మొదటి విజయాన్ని నమోదు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.  తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు.


 వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టిక లో ఏడవ స్థానం నుంచి రెండో స్థానానికి ఒక్కసారిగా ఎగబాకింది. ఈ క్రమంలోనే ఇటీవలే సన్రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు వరుస విజయాలతో ఉన్న గుజరాత్ టైటన్స్ కు సన్రైజర్స్ ఓడించడంతో ఇక ఆ ప్రతీకారాన్ని ఈ మ్యాచ్లో తీర్చుకోవాలని భావించారు. దీంతో ఇక చివరి వరకు కూడా మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. చివరికి గుజరాత్ టైటాన్స్ పై చేయి సాధించింది.  ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ కు ఎలా అయితే సన్రైజర్స్ బ్రేక్ వేసిందో.. ఇప్పుడు వరుసగా ఐదు విజయాలతో జోరు మీద ఉన్న సన్రైజర్స్ కు గుజరాత్ అలాగే బ్రేక్ వేసింది.



 వరుసగా 5 విజయాల తర్వాత ఒక ఓటమి చవిచూసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు  మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు 196 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఈ క్రమంలోనే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. చివర్లో రాహుల్ తేవాటియా  40, రషీద్ ఖాన్ 31 పరుగులు చేసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర వహించారు. ఇక అంతకు ముందు గుజరాత్ బ్యాట్స్మెన్లు వృద్ధిమాన్ సాహా 68, గిల్ 20, మిల్లర్ 17 పరుగులు చేశారు. ఇక గుజరాత్ టైటాన్స్ మరోసారి పాయింట్ల పట్టికలో టాప్ లోకి దూసుకుపోయింది...

మరింత సమాచారం తెలుసుకోండి: