మరి ఈ మ్యాచ్ లో ఢిల్లీ తో కోల్కతా ఓడిపోవడానికి గల కొన్ని ముఖ్య కారణాలను ఒకసారి చూద్దాం.
* జట్టు ఎంపికలో లోపం కనిపిస్తోంది. ఎందుకు పదే పదే జట్టులో మార్పులు చేస్తున్నారో వారికి వారే ప్రశ్నించుకోవాలి. ఇలా చేయడం వలన ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ప్రతి ఆటగాడు కొన్ని సార్లు విఫలం కావడం చాలా సహజం. అంత మాత్రాన తరచూ మారుస్తూ ఉంటే కంటిన్యుటీ పోతుంది. కాబట్టి ముందుగా మీరు ఏ టీమ్ తో ఆడాలి అనుకుంటున్నారో వారిని నిర్ణయించుకుని వారు ఫెయిల్ అవడానికి కారణాలు తెలుసుకుని సెట్ చేయండి. వారినే మ్యాచ్ లకు కొనసాగించండి
* ఇంతకు ముందు చాలా సార్లు ఈ విషయన్ని క్రికెట్ విశ్లేషకులు చెప్పారు. సునీల్ నరైన్ ఓపెనర్ గా సక్సెస్ అయ్యాడు.. ఈ విషయం కోల్కతా కు తెలుసు. కానీ ఎందుకు అతన్ని అదే ప్లేస్ లో ఆడించడం లేదు. ఇక వరుసగా విఫలం అవుతున్న వెంకటేష్ అయ్యర్ కి ఒక మ్యాచ్ విశ్రాంతి ఇవ్వాలి.
* శ్రేయస్ అయ్యర్ ఎందుకో ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తోంది. కెప్టెన్ గా జట్టును ముందుండి నడిపించడం కఠినమైన సవాలే. కానీ అనుక్షణం ఒత్తిడిగా ఉంటే జట్టు గెలుపు అలా ఉంచితే, ప్లేయర్ గా నువ్వు కూడా ఫెయిల్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఫ్రీ గా ఆడు, జట్టును నమ్మి ముందుకు నడిపించు విజయాలు అవే వస్తాయి.
* బౌలింగ్ పరంగా బెస్ట్ అటాక్ మీకు ఉంది. కానీ సరిగా వినియోగించుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ముఖ్యంగా పాట్ కమిన్స్ ను ఎందుకు తొలగించారు అనేది క్లారిటీ లేదు. అతను బౌలింగ్ బ్యాటింగ్ రెండు చేయగల సమర్థుడు. సౌథీ బౌలింగ్ లో పర్వాలేదు అనిపించినా ఇతని కంటే పాట్ నయం. ఇంకా వరుణ్ నుండి ఆశించిన మేర ఫలితం రావడం లేదు. కాబట్టి అతన్ని పరుగులు అయినా నియంత్రించేలా ప్రోత్సహించు.
* ఇక గత సీజన్ లలో అద్భుతంగా రాణించిన నితీష్ రాణాను ఇంకా ముందుగా ఆడించాలి, వీలైతే ఓపెనర్ గా పంపేందుకు అవకాశం చూడాలి.
ఇక ఇవన్నీ ఫాలో అయితే ముందు మ్యాచ్ లలో అయినా గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే చెన్నై ముంబై క సరసన చేరిపోవడమే...!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి