క్రికెట్ ఊపిరిగా బ్రతుకుతూ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి మెరుగైన ప్రదర్శన చేసి దిగ్గజ క్రికెటర్ గా ఎదగాలని ప్రతి యువ క్రికెటర్ భావిస్తూ ఉంటాడు. అయితే ఇలా ఆశ పడుతున్న వారికి ఒక మంచి వేదికగా మారిపోయింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఒక్కసారి ఛాన్స్ దక్కించుకుని బాగా ప్రదర్శన చేశారు అంటే చాలు ఇక ఆటగాళ్ల జీవితం మలుపు తిరిగింది అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఇలా ఐపీఎల్ లో కోట్లు పలికిన ఆటగాళ్లు ఒకవైపు ఫైనాన్షియల్ గా సెట్ అవుతూ ఉండడమే కాదు. మరోవైపు భారత జట్టులో కూడా చోటు దక్కించుకుంటూ ఎంతో పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటున్నారు.


 ఇప్పుడు వరకు ఇలా ఐపీఎల్లో రాణించిన ఎంతో మంది బౌలర్లు అటు భారత జట్టు లో సత్తా చాటారు అన్న విషయం తెలిసిందే. మరి కొంతమంది అటు ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోయినప్పటికీ అనుకోని అదృష్టం వరించింది చివరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఝార్ఖండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సుశాంత్ మిశ్రా కి కూడా ఇలాంటి ఒక అదృష్టం వరించింది అని చెప్పాలి. సన్రైజర్స్ హైదరాబాద్ మీడియం పేసర్ సౌరబ్  దూబే  గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకున్నాడు. దీంతో  నెట్స్ బౌలర్ గా ఉన్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ సుశాంత్ ను సన్రైజర్స్ భర్తీ చేసింది.


 కాగా సుశాంత్ మిశ్రా 2020 దక్షిణాఫ్రికాలో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు.  టోర్నమెంట్ లో ఏడు వికెట్లు తీసిన మిశ్రా మంచి ప్రదర్శన చేశాడు.  దేశవాళీ క్రికెట్లో నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 13 వికెట్లు తీయడం గమనార్హం. 2020- 2021 ఐపీఎల్ సీజన్ వరకు ఆర్సిబి నెట్ బౌలర్గా సుశాంత్ మిశ్రా  వ్యవహరించాడు. కాగా 20 లక్షలు కనీస ధరను సుశాంత్ మిశ్రా ని సొంతం చేసుకునేందుకు సన్రైజర్స్ ఒప్పందం చేసుకుంది. కాగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్  ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl