తెలుగు తేజం తిలక్ వర్మ ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంత మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర జట్ల  అభిమానులు కూడా తిలక్ వర్మ పర్ఫామెన్స్ చూసి మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారూ అనే చెప్పాలి. కేవలం ఒక్క మ్యాచ్ లోనే కాదు ప్రతి మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన కనబరుస్తూ భారీ పరుగులు చేస్తూ ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఓటమిపాలు అయినప్పటికీ అతని ప్రదర్శనలో మాత్రం ఎలాంటి మార్పు లేదు అని చెప్పాలి.


 అంతేకాదండోయ్ ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా కూడా తిలక్ వర్మ కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సీజన్లోనే ఇలాంటి ప్రదర్శన కనబరిచిన తిలక్ వర్మ  అందరిని ఆశ్చర్యానికి గురి చేసాడు.. ఇక ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా తన బ్యాటింగ్ తో అందరిని మంత్రముగ్ధుల్ని చేశాడు. 34 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ముంబై ఇండియన్స్ కూరుకుపోయింది. ఇలాంటి దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ 34 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.


 అనవసరమైన షాట్లకు వెళ్లకుండా ఎంతో ఆచితూచి ఆడుతూ తన టెక్నిక్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తిలక్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్ వర్మ బ్రిలియంట్.. ఆడుతున్న తొలి సీజన్ లోనే ఇంతలా రాణించడం గొప్ప విషయం.. కచ్చితంగా టీమిండియా లోని అన్ని ఫార్మాట్లలో అతడు ఆడుతాడు అని నమ్మకం ఉంది.. అతని టెక్నిక్ ఆత్మవిశ్వాసం టెంపర్ లెస్ అతని ఉన్నతస్థాయిలో నిలబెడతాయి అని చెప్పాలి. అతనికి మంచి భవిష్యత్తు ఉంది అని మాత్రం తప్పకుండా చెప్పగలను. ప్లే ఆఫ్ కు ఛాన్స్ లేకపోయినప్పటికీ ఈ సీజన్ విజయాలతో ముగించాలని అనుకుంటున్నా అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl