సాధారణంగా క్రికెటర్లకు అటు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ ను ఒక మతంగా భావించే భారత్లో అయితే క్రికెటర్లకు మరింత ఎక్కువ గానే పాపులారిటీ ఉంటుంది. ఇక ఎవరైనా ఆటగాళ్లకు సంబంధించి ఏదైనా పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించిందంటే అది క్షణాల్లో వైరల్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే క్రికెటర్లకు సంబంధించి పర్సనల్ విషయం ఏదీ బయటకు వచ్చినా అది హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు టీమిండియా ఫేసర్ దీపక్ చాహర్ కు సంబంధించిన వార్త వైరల్ గా మారింది.


 దీపక్ చాహర్ కు జయ అనే ప్రియురాలు ఉంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి తన ప్రేమను అఫీషియల్  గానే సోషల్ మీడియాలో బయటపెట్టాడు. అయితే ఇప్పుడు జయ భరద్వాజ్ ను దీపక్ చాహర్ పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 1వ తేదీన వివాహం ఘనంగా జరగబోతుంది. ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున మ్యాచ్ ఆడిన దీపక్ ఇక తన ప్రేయసి జయ భరద్వాజ్ కు ప్రపోజ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే  ఢిల్లీకి చెందిన జయ భరద్వాజ్ ఒక కార్పొరేట్ సంస్థలో పని చేస్తూ ఉంటుంది.


 కానీ వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే మెగా వేలంలో దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంతో నమ్మకంతో 14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. గాయం కారణంగా స్టార్ ఆటగాడు సీజన్ మొత్తానికి దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఆడబోయే దక్షిణాఫ్రికా సిరీస్ కు భారత జట్టులో చేరబోతున్నాడు దీపక్. ఇకపోతే దీపక్ చాహర్ పెళ్లి గురించి తెలియడంతో అభిమానులు అందరూ కూడా కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఉండటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl