ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య పోరులో ఎవరు పైచేయి సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అటు గుజరాత్ ఐటమ్స్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వడం గమనార్హం. రాజస్థాన్ రాయల్స్ జట్టు 2008 సీజన్ నుంచి ఐపీఎల్ లో ఉన్నా మొదటి సీజన్లో కప్ గెలిచింది ఇప్పటి వరకు కనీసం ఫైనల్ కి కూడా చేరుకోలేక పోయింది. ఎంతోమంది కెప్టెన్ లుగా మారిన తర్వాత ఇప్పుడు సంజూ శాంసన్ కెప్టెన్సీలో 14 ఏళ్ల నిరీక్షణ తెరదించుతూ ఫైనల్లోకి అడుగుపెట్టింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈరోజు జట్ల అభిమానులు కూడా టైటిల్ గెలవాలని ప్రార్థనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కాగా నేడు కోల్కతాలోని అహ్మదాబాద్ వేదిక ఈ మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది. కాగా ముగింపు వేడుకల నేపథ్యంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. అయితే తొలి సీజన్లోనే ఫైనల్లో అడుగుపెట్టినా గుజరాత్ జట్టు కొట్టాలని చూస్తుంటే మొదటి సీజన్ లో కప్పు కొట్టి సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్ కు చేరిన రాజస్థాన్ అవకాశాన్ని వదులుకోకూడదు అని భావిస్తోంది. రాజస్థాన్లో బట్లర్ సంజూ శాంసన్ యుజ్వేంద్ర చాహల్ ఎంతో కీలకం కానున్నారు. గుజరాత్ టైటాన్స్ సమిష్టి ప్రదర్శనను నమ్ముకుంది. మరి ఏం జరగబోతుంది అన్నది తెలియాలంటే మార్చి వచ్చేంత వరకు ఆగాల్సిందే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి