అయితే మొన్నటి వరకు జరిగిన మ్యాచ్ లో బ్యాట్స్మెన్లు బౌలర్లపై ఆధిపత్యం సాధించి సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం పరిస్థితి మరోలా మారిపోయింది. ఈసారి బౌలర్లు తమ అద్భుతమైన ప్రదర్శన తో బ్యాట్స్మెన్లను పెవిలియన్ చేర్చి చివరికి ఓటమికి పునాదులు వేయడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో కూడా ఎక్కడా అత్యధిక స్కోరు నమోదు కాకపోవడం గమనార్హం. గ్లౌసస్టర్ షైర్ బ్యాటింగ్ దిగిన నిర్ణీత 20 ఓవర్లలో 145 పరుగులు మాత్రమే చేసింది.
ఈ క్రమం లోనే ప్రత్యర్థి జట్టు ఈ చిన్న టార్గెట్ ను ఛేదించి తప్పక విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ బౌలర్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. ఈ క్రమంలోనే 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ససెక్స్ జట్టు 23 పరుగుల వ్యవధిలోనే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత మరో బ్యాట్స్మెన్ వచ్చి మెరుపు ఇన్నింగ్స్ ఆడి విజయం సాధిస్తుందని ఆశలు కల్పించినప్పటికీ చివరికి ఓటమి మాత్రం తప్పు లేదు అనే చెప్పాలి. ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరికి గ్లౌసెస్టర్ షైర్ జట్టు విజయం సాధించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి