ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా అక్కడ గత ఏడాది కరోనా వైరస్ కారణంగా రద్దయినా ఐదవ టెస్ట్ మ్యాచ్ తో పాటు వన్డే టి20 సిరీస్ లు కూడా ఆడబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన ఆసక్తిని సంతరించుకుంది అని చెప్పాలి. అయితే ఇక అటు సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతున్న సమయంలోనే ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే బోయే టెస్టు జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఒక టెస్ట్ మ్యాచ్ కి సంబంధించిన జట్టును ప్రకటించింది కానీ అటువంటి వన్డే టి20 సిరీస్ లకు సంబంధించిన భారత జట్టును మాత్రం ఇప్పటి వరకూ బిసిసిఐ ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ లో ఆడే అవకాశం ఉంది అన్న సమాచారం మాత్రం అందుతోంది. ఆల్ రౌండర్  హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు బయల్దేరింది. ఇక్కడ రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఆడబోతుంది. కాగా జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతుంది.


 అయితే ఈ మ్యాచ్ ముగిసిన రెండు రోజుల వ్యవధిలోనే ఇంగ్లండ్తో తొలి టీ-20 మ్యాచ్ జరగబోతోంది. అయితే టెస్టు మ్యాచులో ఆడిన ఆటగాళ్లు అంత త్వరగా టి20 లకు అలవాటు పడటం చాలా కష్టం అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఐర్లాండ్లో టి20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియానే ఇంగ్లాండులో కూడా టి20 సిరీస్ ఆడే అవకాశం ఉంది అని తెలుస్తుంది. భారత ప్రధాన జట్టు టెస్టు సిరీస్ ఆడుతుండగా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు ఇంగ్లాండ్ తో టి20 మ్యాచ్ లో తలపడబోతుంది అని ఒక బీసీసీఐ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రంతెలియాల్సి ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: