ఆతిథ్య శ్రీలంక జట్టు కు చెందిన ఎంతో మంది ఆటగాళ్లు వరుసగా వైరస్ బారిన పడుతూ ఉండటం గా సంచలనంగా మారిపోయింది అనే చెప్పాలి ఇలా వరుసగా ఒక్కో ఆటగాడు వైరస్ బారిన పడుతూ జట్టుకు దూరం అవుతున్న నేపథ్యంలో అటు శ్రీలంక కు ఊహించని షాక్ లు తగులుతున్నాయ్. టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఓపెనర్ పతుమ్ నిస్సంక కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైరస్ బారిన పడిన లంక ఆటగాళ్ళ సంఖ్య ఆరుకు చేరడం గమనార్హం. మూడో రోజు ఆట లో భాగంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు నిస్సంక.
ఈ క్రమం లోనే వైద్య సిబ్బంది అతనికి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్ అంటూ రిపోర్ట్ వచ్చింది. అప్పటివరకు మ్యాచ్ ఆడిన అతను ఇక మధ్యలోనే వైదొలిగాడు. ఈ క్రమంలోనే నిస్సంక స్థానంలో ఓశడా ఫెర్నాండో సబ్స్టిట్యూట్ గా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పాలి అయితే తొలి టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏంజెలో మాథ్యూస్ కూడా ఇలాగే మ్యాచ్ లో కరోనా వైరస్ బారినపడి మైదానం నుంచివెళ్ళిపోయాడు. ఇలా ఆటగాళ్లు వైరస్ బారిన పడుతున్న నేపథ్యంలో దిగ్గజ ఆస్ట్రేలియాతో ఎదుర్కోబోయే లంక జట్టు బలహీనంగా మారిపోతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి