వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇండియా శుభారంభం చేయడమే కాదు ఇక అదే జోరును కొనసాగిస్తూ ఆతిథ్య వెస్టిండీస్ జట్టుకు షాక్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులోకి తీసుకోవడమే కాదు వెస్టిండీస్ పర్యటనలో భాగంగా అతనికి కెప్టెన్సీ అప్పగించింది జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీలో టీమిండియా రాణిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు జట్టుకు దూరమైన నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై ఎన్నో అనుమానాలు రేకెత్తాయి.



 అయితే ఈ అనుమానాలు అన్నింటినీ కూడా పటాపంచలు చేసిన టీమిండియా అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంది. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.. అటు మూడు మ్యాచ్ లలో కూడా విజయం సాధించి క్లీన్స్వీప్ చేసింది అని చెప్పాలి. రెండు మ్యాచ్ ల లాగానే మూడో మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుందని అందరూ భావించారు. కానీ టీమ్ ఇండియా పూర్తి ఆధిపత్యాన్ని సాధించింది అని చెప్పాలి. వర్షం కారణంగా మ్యాచ్ 40 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలోనే మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది.


 బ్యాటింగ్ చేసిన ఆతిథ్య వెస్టిండీస్ జట్టు టార్గెట్ చేధించలేక పోయింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి లో భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ జట్టు 26 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు అనూహ్యంగా 119 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించినా వెస్టిండీస్ జట్టును క్లీన్స్వీప్ చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే వెస్టిండీస్ గడ్డపై తొలిసారి మూడు లేదా అంతకంటే ఎక్కువ జరిగిన వన్డే సిరీస్ లో తొలిసారి క్లీన్ స్వీప్ చేసి అరుదైన రికార్డును కూడా టీమిండియా ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: