వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకుని ఇక ఫైనల్లో అడుగుపెట్టాలని ప్రతి ఒక జట్టు కోరికతో ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో కేవలం మొదటి రెండు స్థానాలలో ఉన్న జట్లు  మాత్రమే ఫైనల్లో అడుగుపెట్టి టైటిల్ కోసం పోరాడుతూ ఉంటాయి. ఇక ఈ లిస్టులో ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా.. భారత జట్టు 4వ స్థానంలో ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఈ రెండు జట్లకు కూడా జరగబోయే అన్ని టెస్ట్ మ్యాచ్ లూ ఎంతో కీలకంగా మారబోతున్నాయి.


 ముఖ్యంగా వచ్చే ఏడాది భారత పర్యటనకు రానుంది ఆస్ట్రేలియా.    పర్యటనలో భాగంగా భారత జట్టుతో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడ బోతుంది  ఆస్ట్రేలియా జట్టు. మొదటి మార్చ్ మార్చి 3వ తేదీన న్యూఢిల్లీ వేదికగా జరగబోతుంది. అయితే ఈ టెస్ట్ ఆస్ట్రేలియాకు మరోవైపు భారత జట్టుకు కూడా ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించే అవకాశాలు సిరీస్ పైన ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే బోర్డర్-గవాస్కర్ సిరీస్కు ముందు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ లో భారత్ తలపడనుంది. భారత పర్యటన ముగించుకున్న తర్వాత వెస్టిండీస్ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడ పోతుంది ఆస్ట్రేలియా.


 ఈక్రమంలోనే ఆస్ట్రేలియా భారత్ జట్లకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫి ఎంతో కీలకంగా మారనుంది అని రికీపాంటింగ్ చెప్పుకొచ్చాడు. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందని తెలిపాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య పోటీ ఆస్ట్రేలియాలో జరిగిన భారత్లో జరిగిన హోరాహోరీ గానే ఉంటుందని.. ప్రతి యేటా ఈ రెండు జట్ల మధ్య పోటీ మరింత తీవ్రం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టు ఫైనల్లో అడుగుపెట్టాలి అంటే తప్పక భారత జట్టును ఓడించి వలసిన అవసరం ఉంది అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: