టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరం గా మారింది. ఒకప్పుడు రికార్డుల మోత మోగించిన ఈ రన్నింగ్ మెషీన్.. ఇప్పుడు పరుగుల చేయలేక డీలా పడుతోంది. ఒకప్పుడు కోహ్లీ బ్యాటింగ్ కు దిగితే పరుగుల వరద పారేది. రికార్డులు బద్దలు కొట్టేవాడు. క్రికెట్ లో సరికొత్త రికార్డులు సృష్టించే వాడు. సెంచరీ, హాఫ్ సెంచరీలతో చెలరేగి పోయేవాడు. చాలా అగ్రసీవ్ గా ఆడేవాడు కోహ్లీ. కానీ ఏమైందో ఏమో కానీ బీసీసీఐ తో విబేధాల తర్వాత కోహ్లీ ప్రదర్శన బాగా నెమ్మదించింది.

పరుగులు చేయలేక కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు. చెత్త షాట్ లు ఆడుతూ బౌలర్లకు దొరికి పోతున్నాడు. గత కొంత కాలంగా అన్ని మ్యాచ్ లలో కోహ్లీ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడి పేలవ ఫామ్ పై మాజీ క్రికెటర్లు, టీమిండియా ఫాన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జట్టులో నుంచి తీసివేయాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. అయినా బీసీసీఐ అతడికి అవకాశాలు ఇస్తూనే ఉంది.

అయితే ఈ ఏడాదిలో జరిగే ఆసియా కప్ లో కోహ్లీని జట్టు లోకి తీసుకుంటారా?  లేదా అనేది అనుమానం గా మారింది. ఈ క్రమం లో దీనిపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కప్ కు కోహ్లీని ఎంపిక చేయక పోవచ్చని అంచనా వేశాడు. కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేస్తుందని అభిప్రాయపడ్డాడు. కోహ్లీని వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్ కు తీసుకోలేదని, వెస్టిండీస్ సిరీస్ కు తీసుకోకుడా విశ్రాంతి ఇచ్చారన్నారు. అయితే జింబాబ్వే సిరీస్ కు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు.

వెస్టిండీస్ తో సిరీస్ కు విశ్రాంతి ఇచ్చినా.. జింబాబ్వే సిరీస్ కు తీసుకోవాల్సి ఉందని కనేరియా తెలిపాడు. జింబాబ్వే టూర్ తో ఫామ్ లోకి వచ్చి ఆసియా కప్ లో బాగా ఆడే అవకాశం ఉండేదన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: