దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో ప్రాక్టీస్ సెషన్లో భాగంగా గాయం బారినపడిన కె.ఎల్.రాహుల్ ఇప్పటికీ టీమిండియాకు అందుబాటులోకి రాలేకపోయాడు. ఈ గ్యాప్ లో టీమిండియా ఐర్లాండ్ ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకుని ఇప్పుడు వెస్టిండీస్ పర్యటన ముగించుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే కె.ఎల్.రాహుల్ స్థానంలో ఓపెనర్ కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తోంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇటీవల సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్గా మంచి ఇన్నింగ్స్ తో జట్టుకు విజయాన్ని అందించాడు.


 అయితే గత కొంత కాలం నుంచి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్  మరికొన్ని రోజుల్లో భారత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే టీమిండియాలో స్థానాల కోసం తీవ్రమైన పోటీ ఉంది అన్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే కేఎల్ రాహుల్   అవసరమా అనే కొత్త చర్చ కూడా మొదలయ్యింది. ఇక ఇటీవల ఇదే విషయంపై న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ స్కాట్ స్టైరిస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.



 కేఎల్ రాహుల్ తప్పుకోవడం వల్ల ఎంతో మంది యువ ఆటగాళ్లకు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం వచ్చింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఎవరైనా సరే తాము జట్టు నుంచి బయటకు పోకుండా ఉండాలని.. ఇతర ప్లేయర్లు తమ స్థానంలో రాకూడదు అని భావిస్తూ ఉంటారు. కానీ భారత్లో మాత్రం మంచి సాంప్రదాయం కొనసాగుతోంది. తమ స్థానంలో ఇతర ఆటగాళ్లకు అవకాశం కల్పించిన కొంతమంది ప్లేయర్లు పెద్దగా పట్టించుకోరు. ఓ ఆటగాడిగా నేను కూడా నా స్థానంలో మరొకరికి అవకాశం ఇవ్వాలని కోరుకోను. అయితే ఇటీవల సూర్యకుమార్ యాదవ్ రాణించిన నేపథ్యంలో ఢిల్లీలో రాహుల్ జట్టులో అవసరమే అనే అనుమానాలు సెలెక్టర్లలో మొదలయ్యాయ్. ఎందుకంటే అతను మళ్లీ వచ్చిన ఫామ్ లో ఉంటాడో లేదో అన్నది కూడా చెప్పలేని విధంగా మారిపోయింది అంటూ స్కాట్ స్టైరిస్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: