మరికొన్ని రోజుల్లో భారతజట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లబోతోంది అన్న విషయం తెలిసిందే . దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇక ఈ పర్యటనకు సిద్ధమైంది భారత జట్టు. ఇక ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది. అయితే సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ద్వితీయశ్రేణి జట్టు జింబాబ్వే జట్టుతో తలపడనుంది అన్నది తెలుస్తుంది. ముందుగా శిఖర్ ధావన్ ను కెప్టెన్గా నియమిస్తూ 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను అధికారికంగా ప్రకటించింది బిసిసీ.


 కానీ ఇటీవల జట్టులో అనూహ్యమైన మార్పులు చేసింది. అన్న విషయం తెలిసిందే. శిఖర్ ధావన్ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ వైస్ కెప్టెన్గా మార్చింది. దీంతో కేఎల్ రాహుల్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అయితే పసికూన జింబాబ్వే జట్టు పై భారత జట్టు ఎంత అలవోకగా విజయం సాధించడం ఖాయం అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే జింబాబ్వే జట్టుకు  మొన్నటివరకు హెడ్ కోచ్ గా ఇక ఇప్పుడు టెక్నికల్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు టీమిండియా మాజీ క్రికెటర్ లాల్ చంద్ రాజ్ పుత్. ఈ క్రమంలోనే భారత్తో జరిగే వన్డే సిరీస్ గురించి మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 భారత్ ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లు జింబాబ్వేతో తరచు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడాలి అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. 2016 తర్వాత భారత్ ఇక్కడ పర్యటించడం జింబాబ్వే ఆటగాళ్లకు మంచి అవకాశం అంటూ చెప్పుకొచ్చా.డు అయితే భారత జట్టు ఎంతో పటిష్టంగా ఉన్నప్పటికీ జింబాబ్వే తరపున గట్టి పోటీ ఇస్తాము అంటూ చెప్పుకొచ్చాడు లాల్ చంద్ రాజ్పుత్. ఇటీవలే  బంగ్లాదేశ్ను ఓడించిన తమ జట్టు టీమిండియాకు గట్టిపోటీ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జింబాబ్వే జట్టు అనుభవజ్ఞులు యువ ఆటగాళ్ల కలయికతో పటిష్టంగా ఉంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: