కొంతమంది యువ ఆటగాళ్లను కూడా రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడి గా సెలెక్ట్ చేస్తూ ఎన్నో ప్రయోగాలు చేస్తూ వస్తోంది. కానీ ఇప్పటివరకు రోహిత్ శర్మ తో సరైన ఓపెనింగ్ జోడి టీమిండియాకు దొరకలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇటీవలే గాయం నుంచి కోరుకున్న కె.ఎల్.రాహుల్ ను మళ్ళీ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడి గా పెట్టేసింది టీమ్ ఇండియా యాజమాన్యం. కాగా ఇక టీమిండియాకు ఓపెనింగ్ జోడీగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఇప్పటి వరకు ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీం ఇండియా మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కె.ఎల్.రాహుల్ జోడి తన ఫేవరేట్ ఓపెనింగ్ జోడి అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ గాయం బారినపడి కె.ఎల్.రాహుల్ జట్టుకు దూరమైతే అప్పుడు రోహిత్ శర్మ కు జోడీగా రిషబ్ పంత్ ను ఓపెనింగ్ పంపిస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా మరికొంతమంది ఇక రోహిత్ శర్మకు సూర్యకుమార్ యాదవ్ సరైన ఓపెనింగ్ జోడి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి