ప్రస్తుతం టీమిండియా సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ ఆడుతోంది . ఇక సొంతగడ్డపై ఆడుతూ ఉండడంతో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మొదటి మ్యాచ్లోనే పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇక ఈ దారుణమైన ఓటమి నేపథ్యంలో టీమిండియా ప్రదర్శనపై ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మొదటి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 208 పరుగుల చేసింది. ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ఎంతో అలవోకగా టీమిండియా విజయం సాధిస్తుందని అందరూ భావించారు.


 కానీ ఊహించని రీతిలో టీమిండియాకు చుక్కెదురైంది అని చెప్పాలి. జట్టులో హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లు ఉన్నారు. వీరిద్దరు కూడా డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసి పరుగులను కట్టడి చేయాలి. కానీ మొదటి మ్యాచ్లో టీమ్ ఇండియా బౌలింగ్ చూసుకుంటే గెలవాల్సిన మ్యాచ్లో చివరికి ఓడిపోయింది. దీంతో బరిలో పరుగులు కట్టడి చేసి జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తారు అనుకుంటే కీలక బౌలర్లు గా భావించిన హర్షల్, పటేల్ భువనేశ్వర్ కుమార్ పరుగులు సమర్పించుకున్నారు. హర్షల్ పటేల్ 18 ఓవర్లు 22 పరుగులు సమర్పించుకుంటే భువనేశ్వర్ కుమార్ 19 ఓవర్ లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.


 దీన్ని బట్టి చూస్తే జస్ప్రిత్ బూమ్రా వస్తే తప్ప జట్టు బౌలింగ్ విభాగం గాడిలో పడే అవకాశం లేదు అని ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లోనే కాదు గతంలో ఆసియా కప్ లో జరిగిన మ్యాచ్ లో కూడా టీమిండియాను డెత్ ఓవర్ల గండం వెంటాడుతూనే ఉంది. ఆసియా కప్ లో కూడా కీలకమైన మ్యాచ్లలో  పరుగులు కట్టడి చేయకపోవడం కారణంగానే ఓడిపోయిన ఘటనలు ఉన్నాయి. మరి ఈ సమస్యను నుండి టీమిండియా ఎలా అధిగమిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: