
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి తన బ్యాట్ ఝలిపించి 25 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత బ్యాట్స్మెన్స్ గురించి అందరూ చర్చించుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ పేరు కూడా మారుమోగిపోతుంది. అంతర్జాతీయ క్రికెట్లోకి మొన్నటిమొన్న అరంగేట్రం చేశాడు. కానీ అంతలోనే రికార్డులవేట ప్రారంభించాడు. మూడో టి20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయినప్పటికీ అతను మాత్రం ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.
ఆ బ్యాట్స్మెన్ ఎవరో కాదు ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరున్ గ్రీన్. ఒకరకంగా టీమ్ ఇండియాతో జరిగిన మూడో టి20 లో అతను తన బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడి 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కామరూన్ గ్రీన్. భారత జట్టుపై టి20 లలో అత్యంత వేగంగా అర్ద సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా యువ బ్యాట్స్మెన్ కామెరున్ గ్రీన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు వెస్టిండీస్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ టి20 లో టీం ఇండియా పై 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి రికార్డు సృష్టిస్తే.. ఇప్పుడు కామరూన్ గ్రీన్ ఈ రికార్డు బ్రేక్ చేశాడు.