సాధారణంగా విరాట్ కోహ్లీ ఒక్కసారి గ్రీసులో కుదురుకున్నాడు అంటే సిక్సర్లు ఫోర్లతో ఎలా కొట్టగలడో ప్రత్యేకంగా ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు. మైదానంలో గ్యాప్ ఎక్కడ ఉందో అన్న విషయాన్ని గమనించి ఆ గ్యాప్ లో ఎంతో కచ్చితత్వంతో షాట్లు ఆడుతూ ఉంటాడు. సిక్సర్లు ఫోర్లు కొట్టడం విషయంలోనే కాదు వికెట్ల మధ్య పరుగులు పెట్టడంలో కూడా విరాట్ కోహ్లీ తోపే అన్న విషయం తెలిసిందే. ఎంతో వేగంగా కదులుతూ మెరుపు వేగంతో పరుగులు తీస్తూ ఉంటాడు. ఇక ఇలా పరుగులు తీసే క్రమంలో ఎలాంటి మిస్టేక్ కోహ్లీ నుంచి జరగవు అన్నది అభిమానులు పక్కాగా చెబుతారు.


 కానీ ఇటీవలే విరాట్ కోహ్లీ కి ఒక వింత అనుభవం ఎదురయింది. సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో విరాట్ కోహ్లీ బాగా రాణించినప్పటికీ ఒక పరుగు తేడాతో హాఫ్ సెంచరీకి దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే తన తప్పిదం వల్ల ఇలా హాఫ్ సెంచరీకి దూరం కావడం గమనార్హం. ఎందుకంటే కోహ్లీ షార్ట్ రన్ తప్పిదంతో తన 34వ హాఫ్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఆగిపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే 15వ ఓవర్లో కోహ్లీ 13 బంతులో 16 పరుగులు సూర్య 14 బంతుల్లో 41 పరుగులతో దూకుడుగా ఆడుతున్నారు. పార్నల్ వేసిన 5 ఓవర్ లో కోహ్లీ స్క్వేర్ లెగ్ దిశగా ఆడాడు. ఇక మైదానంలో కోహ్లీ - సూర్య జోడి రెండు పరుగులు పూర్తి చేశారు.


 అంతలోనే అంపైర్ షార్ట్ రన్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. అదేంటి అని ఆశ్చర్యపోయిన కోహ్లీ సందేహం వ్యక్తం చేసాడు. తర్వాత రిప్లై లో చూసుకుంటే తొలి పరుగు పూర్తి చేసే క్రమంలో నాన్ స్ట్రైక్ ఎండ్ లో తన బ్యాట్ ను కోహ్లీ క్రీజు లో పెట్టలేదని రిప్లై లో స్పష్టంగా తెలిసింది. రూల్స్ ప్రకారం పరుగులు తీసే బ్యాట్స్మెన్ తమ బ్యాట్ ను క్రీజులో పెట్టకపోతే దానిని షార్ట్ రన్ గా పరిగణిస్తారు. దీంతో కోహ్లీ పరుగులు ఖాతా నుంచి ఒక రన్ మైనస్ అయింది. తద్వారా ఆప్ సెంచరీ చేయకుండా అదే అడ్డుకుంది. ఎప్పుడు రూల్స్ పై క్లారిటీతో ఉండే కోహ్లీ మాత్రం పొరపాటు చేసేసాడు. ఇక ఈ చిన్న పొరపాటు కోహ్లీ కెరీర్ లో జీవితాంతం గుర్తుంటుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: