ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పైసా వసూల్ మ్యాచ్ గా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించిన విధంగా అటు ప్రేక్షకులు అందరి ఆశలపై వరుణ దేవుడు నీళ్లు చల్లబోతున్నాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కి వరుణ గండం ఉంది అని గత కొన్ని రోజుల ముందు నుంచే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మ్యాచ్ జరిగే సమయానికి వాతావరణంలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉంటుందని అందరూ ఆశపడ్డారు.
అయితే ఇక దాయాదులో పోరుకు అటు వరుడు అంతరాయం కలిగించడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే స్థానిక వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. భారత్ పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కి 80 నుంచి 90% వరణ గండం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గరిష్టంగా ఐదు మిల్లీమీటర్ల వరకు కూడా వాన కురవచ్చని చెబుతున్నారు. అయితే ఇటీవలే శుక్రవారం రోజున కూడా మెల్బోర్న్ లో భారీ వర్షం కురిసింది అన్న విషయం తెలిసిందే. విషయం తెలిసి వరుణ దేవుడా కాస్త కరుణించవయ్యా అంటూ క్రికెట్ అభిమానులు దేవుని ప్రార్థిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి