సాధారణంగా ఛాంపియన్ జట్ల మధ్య పోరు జరిగినప్పుడు ఆ పోరు ఎంత హోరోహోరీగా జరుగుతూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరిపై ఒకరు ఆదిపత్యం చెలాయించడం కాదు చివరి నిమిషం వరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగానే ఆ ఆసక్తికరమైన పోరు జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇక క్రీడ అభిమానులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆట ఏదైనా సరే ఛాంపియన్ల మధ్య పోటీ అంటే ఎప్పుడు ప్రేక్షకులకు ఆసక్తికరంగానే మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఇలాగే ఛాంపియన్ జట్ల మధ్య పోటీ జరిగింది.


 ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతూ ఉండగా ప్రపంచ నలుమూలలో ఉన్న ఫుట్బాల్ అభిమానులందరూ కూడా ఈ వరల్డ్ కప్ మేనియాలో మునిగిపోయారు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ ని కూడా వదలకుండా చూస్తూ ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు. అంతేకాదు తమ అభిమాన జట్టుకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పాలి. కొంతమంది అభిమానులు అయితే నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూడడానికి తరలి వెళ్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ఛాంపియన్లుగా కొనసాగుతున్న జర్మనీ, స్పెయిన్ మధ్య మ్యాచ్ జరిగింది.


 ఇక అందరూ ఊహించినట్లుగానే ఇక ఈ ఛాంపియన్ జట్ల మధ్య పోరు హోరాహోరీ గానే సాగింది అని చెప్పాలి. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ పోరులో ఫస్ట్ హాఫ్ లో ఇరు జట్లకు ఒక్క గోల్ కూడా లభించలేదు. దీంతో ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. ఇక సెకండ్ హాఫ్ లో స్పెయిన్ ఒక గోల్ కొట్టి అదరగొట్టింది అని చెప్పాలి. అయితే భరితమైన పోరులో స్పెయిన్ కి విజయం ఖాయం అనుకుంటున్న సమయంలో జర్మనీ మరో గోల్ కొట్టింది. దీంతో 1-1 తేడాతో ఈ ఛాంపియన్ల మధ్య పోరు కాస్త టై గానే ముగిసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: