గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలంలో అనూహ్యమైన  మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా సౌరబ్ గంగూలీ రెండవసారి ఎంపిక అవుతాడు అనుకుంటున్న సమయంలో బీసీసీఐ పెద్దల నుంచి ఎలాంటి సహకారం లేకపోవడంతో చివరికి సౌరబ్ గంగూలీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కనీసం అప్పటి వరకు ఒక్కసారి కూడా తెర మీదకి రాని రోజర్ బిన్ని ఎవరు ఊహించనీ విధంగా బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టాడు అన్న విషయం తెలిసిందే.


 ఇక రోజర్ బిన్నీ బీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. పాత అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ ఉన్న సమయంలో చేపట్టిన అన్ని విషయాలను కూడా మారుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఇటీవల ఏకంగా సెలక్షన్ కమిటీ పై కూడా వేటు వేస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారిపోయింది. చేతన్ శర్మ నేతృత్వంలోనే సెలక్షన్ కమిటీ మొత్తాన్ని రద్దుచేసి ఇక కొత్త కమిటీని నియమించేందుకు సిద్ధమయ్యాడు రోజర్ బిన్ని.


 ఈ క్రమంలోనే బిసిసిఐ సెలక్షన్ కమిటీలోకి కొత్తగా రాబోయేది ఎవరు అన్న విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇకపోతే బీసీసీఐ సెలక్షన్ కమిటీ లో ఉన్న ఐదు పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ నిన్నటితో ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పోస్టుల కోసం 50 మందికి పైగా అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో మణిందర్ సింగ్ 35 టెస్టులు, 59 వన్డేలు ఆడి అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్ గా ఉన్నాడు. ఎస్ ఎస్ దాస్, కాంబ్లీ  ఆ తర్వాత  ఉన్నారు అని చెప్పాలి. ఇక దక్షిణ జోన్ నుంచి హైదరాబాద్ మాజీ స్పిన్నర్ కున్వాల్ జీత్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: