శుభమన్ గిల్.. ఈ పేరు గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో మారుమోగిపోతుంది. కేవలం భారత క్రికెట్లో మాత్రమే కాదు అతనీ బ్యాటింగ్ విధ్వంసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. 23 ఏళ్ల కుర్రాడు ఏకంగా 30 ఏళ్ల అనుభవం ఉన్న ఆటగాడిలాగా అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. తన అద్భుతమైన ఆటతీరుతో అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. కేవలం రోజుల వ్యవధిలోని వరుసగా సెంచరీలు చేస్తూ ఎన్నో ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఫార్మాట్ ఏదైనా సరే తన బ్యాటింగ్ విధ్వంసం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నాడు.


 ఒక రకంగా చెప్పాలంటే తన బ్యాటింగ్ విధ్వంసంతో 23 ఏళ్లకే స్టార్ బౌలర్లకు సైతం సింహ స్వప్నంలా మారిపోయాడు అని చెప్పాలి. ఇక ప్రత్యర్థి జట్లు మొత్తం స్టార్ ప్లేయర్ల కోసం ప్రత్యేకంగా వ్యూహాలను సిద్ధం చేసుకున్న విధంగానే ఇక యువ ఆటగాడు గిల్ కోసం కూడా మరింత ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకునే విధంగా తన ఆట తీరుతో ప్రభావం చూపిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో కూడా సెంచరీ చేసి తన కెరియర్ లో మొదటి టీ20 సెంచరీ నమోదు చేశాడు శుభమన్ గిల్. అతని అద్భుతమైన బ్యాటింగ్ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి.


 ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో భాగంగా గిల్ చెలరేగిపోయి ఏకంగా 126 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే తన సక్సెస్ సీక్రెట్ ఏంటి అన్న విషయంపై ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నన్ను నాలాగే నేచురల్ గా గేమ్ ఆడమని ప్రోత్సహించాడు. ఇక అది ఫలించినందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే నా విజయానికి క్రెడిట్ మా నాన్నకు, టీమ్ మేనేజ్మెంట్, కెప్టెన్ కి చెందుతుంది అంటూ తెలిపాడు. ఇక నా విజయంలో 90% క్రెడిట్ మా నాన్నకే ఇస్తాను అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: