గత కొంతకాలం నుంచి భారత జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తుంది. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన కీలకమైన సిరీస్ ల సమయంలో జట్టుకు దూరమవుతున్న పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి కూడా భారత్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పటికే రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడి ప్రస్తుతం జట్టుకు అందుబాటులో ఉండడం కాదు కదా కనీసం మైదానంలో కూడా అడుగుపెట్టలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పాలి.


 అదే సమయంలో ఇక భారత టెస్టు జట్టులో మరో కీలక ఆటగాడు అయినా శ్రేయస్ అయ్యర్ సైతం ప్రస్తుతం వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. టెస్టు సిరీస్ ప్రారంభ సమయానికి ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది అనుమానంగానే మారింది. అయితే ఇక రవీంద్ర జడేజా మోకాలి శస్త్ర చికిత్స గాయం నుంచి కోలుకొని మళ్ళీ ఫిట్నెస్ సాధించాడు. ఇక అతను ఆస్ట్రేలియా తో సిరీస్ లో ఆడేందుకు జాతీయ క్రికెట్ అకాడమీ ఇటీవల అనుమతించింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.


 అయితే రవీంద్ర జడేజా అందుబాటులోకి రావడం పై మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా స్పందించాడు. జడేజా అందుబాటులోకి వచ్చేసాడు. అతను ఇటీవల రంజి ట్రోఫీ మ్యాచ్లో కూడా చాలా వికెట్లు పడగొట్టాడు. ఇప్పటికే భారత శిబిరంలో భాగమయ్యాడు. అయితే జడేజా అలాంటి ప్లేయర్ ఫీట్ గా ఉండడం టీమిండియా కు ఎంతో ముఖ్యం. ఎందుకంటే రిషబ్ పంత్ అందుబాటులో లేడు. శ్రేయస్ అయ్యర్ ఆడేది అనుమానమే. సూర్య కుమార్ తుదిజట్టులోకి వచ్చే ఛాన్స్ వచ్చిన ఎలా రాణిస్తాడో తెలియదు. హనుమ విహారి కూడా జట్టులో లేడు. ఇలాంటి సమయంలో జడ్డు ఇక భారత జట్టులో లేకపోతే బ్యాటింగ్ విభాగం ఎంతో బలహీనంగా మారుతుంది అంటూ ఆకాశ చోప్రా అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: