ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎక్కడ చూసినా కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ గురించి చర్చ జరుగుతుంది అని చెప్పాలి . కాగా గత రెండేళ్ల నుంచి టెస్ట్ ఫార్మాట్లో అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ దూసుకు వచ్చిన ఆస్ట్రేలియా భారత్ జట్లు ప్రస్తుతం డబ్ల్యూటీసి ఫైనల్లో పోటీ పడబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఫైనల్ మ్యాచ్ అటు జూన్ 7వ తేదీన జరగబోతుంది. ఇక జూన్ 7 నుంచి 11వ తేదీ వరకు ఈ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ లో విజయం సాధించి విశ్వవిజేతగా ఎవరు నిలుస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.


 కాగా డబ్ల్యూటీసి ఫైనల్ జరగడానికి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పటినుంచి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇక ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు. అంతేకాకుండా ఇక డబ్ల్యూటీసి ఫైనల్ లో తుది జట్టులో ఎవరు ఉంటారు అనే విషయంపై ఇక ఆయా క్రికెట్ బోర్డులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఉండడం గమనార్హం. కాగా గత సీజన్లో కూడా అటు డబ్ల్యుటిసి ఫైనల్ లో టీమిండియా అడుగుపెట్టినప్పటికీ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈసారి మాత్రం తప్పనిసరిగా కప్పు గెలవాలని ఆశిస్తున్నారు భారత అభిమానులు.



 అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ లో అటు టీమ్ ఇండియాకి విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కామెంట్ చేశాడు. హార్దిక్ పాండ్యా టెస్ట్ ప్రణాళిక ఏంటో నాకైతే తెలియదు.. కానీ మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజులు మాత్రం సూపర్ ఫామ్ లో ఉన్నారు. వారంతా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్లు. సిరాజ్ టాప్ బౌలర్గా ఎదుగుతున్నాడు. గతంలో ఇంగ్లాండ్ లోనే ఇంగ్లాండ్ను ఓడించారు.  అందుకే భారత్ కే ఈసారి డబ్ల్యూటీసి ఫైనల్ లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్  ఫించ్ వ్యాఖ్యానించాడు. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ గెలవడానికి కూడా టీమ్ ఇండియా పూర్తి అర్హత కలిగిన జట్టు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: