ఐపీఎల్ 16 వ సీజన్ కోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు జరిగిన 15 సీజన్ లు ఎంతో ఆసక్తికరంగా జరిగి క్రికెట్ ప్రేక్షకులను అలరించాయి. ఇక గత సీజన్ నుండి ఐపీఎల్ ట్రోపీ కోసం పది జట్లు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా లాస్ట్ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ను ట్రోఫీ వరించింది. ఈసారి సీజన్ లో ఇంకా రసవత్తర పోటీ ఉండే అవకాశం ఉంది. మరో వారం రోజుల్లో ఐపీఎల్ పండుగ ముస్తాబు కానుంది. ఐపీఎల్ టీం లు అన్నీ కూడా కొత్త ప్లేయర్స్ తో కళకళలాడుతూ ఉన్నాయి. ఇక ఐపీఎల్ లో 15 సీజన్లు ముగిసినా ఇంకా కొన్ని టీం లకు అయితే టైటిల్ కలగానే మిగిలిపోయింది.

ఆ జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు , ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మరియు గత సంవత్సరమే ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ లు ఉన్నాయి. కాగా ఈసారి పక్కా ప్లానింగ్ తో టైటిల్ ను కొట్టాలన్న కసితో ఈ జట్లు ఉన్నాయి. అయితే పంజాబ్ కింగ్స్ కు ఒక తలనొప్పి వచ్చి పడింది. గత కొంతకాలంగా మంచి ప్లేయర్స్ జట్టులో ఉన్నా టైటిల్ ను కొట్టడంలో విఫలం అవుతూ వస్తున్నారు. అందుకే ఈ సారి మంచి ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేసి సమరానికి సిద్ధంగా ఉంది. అయితే సరిగా ఇప్పుడు ఒక చిక్కొచ్చి పడింది. పంజాబ్ వికెట్ కీపర్ మరియు బ్యాట్సమాన్ అయిన ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో... గత ఆరు నెలల క్రితం కాలుకి శస్త్ర చేయించుకున్న సంగతి తెలిసిందే.

అయితే డాక్టర్స్ రిపోర్ట్స్ ప్రకారం మరో రెండు వారాలలో మైదానంలోకి దిగవచ్చట. కానీ ఇంగ్లాండ్ మరియు వేల్ క్రికెట్ బోర్డు మాత్రం ఐపీఎల్లో ఆడడానికి బెయిర్ స్టో అనుమతిని ఇవ్వడంలో నిరాకరించినట్లు సమాచారం. దీనితో పంజాబ్ కు భారీ షాక్ తగిలినట్లయింది. బెయిర్ స్టో ను వేలంలో 6 .75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ కీలక ఆటగాడు ఐపీఎల్ కు డుమ్మా కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.  

 




మరింత సమాచారం తెలుసుకోండి: