ఈ ఏడాది జరగబోయే రెండు మెగా టోర్నిల  గురించి ఎప్పుడూ లేనంతగా చర్చ జరుగుతుంది. ఆ మెగా టోర్నిలు ఏవో కాదు భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ తో పాటు పాకిస్తాన్ వేదికగా జరిగే ఆసియా కప్. అయితే ఇతర వేదికలపై జరిగి ఉంటే.. ఇంత చర్చ జరిగేది కాదేమో.. కానీ క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతున్న రెండు దేశాలలో.. ఈ రెండు టోర్నీలు జరుగుతున్న నేపథంలో ఇక ఇంత చర్చ జరుగుతుంది.  అయితే పాకిస్తాన్ లో ఆసియా కప్ నిర్వహిస్తే తాము వెళ్లే ప్రసక్తే లేదు అంటూ ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.


 ఇక ఒకవేళ భారత జట్టు ఆసియా కప్ కోసం పాకిస్తాన్ రాకపోతే తాము కూడా భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటాము అంటూ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా చెబుతూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఈ విషయంపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. బీసీసీఐ లాంటి ఇక బలమైన క్రికెట్ బోర్డుని పక్కన పెట్టడం జరగని పని అన్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఈ విషయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.



 ఈ క్రమంలోనే ఆసియా కప్ 2023 నిర్వహణపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం. పాకిస్థాన్లోనే ఆసియా కప్ నిర్వహిస్తారట. అయితే భారత జట్టు ఆడబోయే మ్యాచ్లను మాత్రం పాకిస్థాన్లో కాకుండా ఇక యూఏఈ వేదికగా నిర్వహించాలని అనుకుంటున్నారట. యూఏజీ మాత్రమే కాకుండా ఒమన్, ఇంగ్లాండ్, శ్రీలంక వేదికలను కూడా పరిశీలిస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఇక దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతుందట.  సెప్టెంబర్లో 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ ఏడాది ఆసియా కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. మరి భారత్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: