సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న వెస్ట్ ఇండీస్ ప్రస్తుతం టీ 20 సిరీస్ ను ఆడుతోంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో విండీస్ కెప్టెన్ పావెల్ చెలరేగడంతో విజయాన్ని అందుకుంది. కాగా ఈ రోజు సెంచూరియన్ పార్క్ వేదికగా జరిగిన రెండవ టీ 20 లో సౌత్ ఆఫ్రికా మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఊచకోతకు మరోపేరుగా నిలిచిన వెస్ట్ ఇండీస్ ఆటగాళ్లు సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఉతికి ఆరేశారు. విండీస్ నిర్ణీత ఓవర్ లలో అయిదు వికెట్ల నష్టానికి 258 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఈ స్కోర్ లో జాన్సన్ చార్లెస్ వీరోచిత ఇన్నింగ్స్ తో కేవలం 46 బంతుల్లోనే 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆకాశమే హద్దుగా సాగిన ఇతని ఇన్నింగ్స్ లో మొత్తం 11 సిక్సులు మరియు 10 ఫోర్లు ఉండడం విశేషం. ఇతనికి మేయర్స్ (51) , షెపర్డ్ (41) మరియు పావెల్ (28) ల నుండి చక్కని సహకారం అందింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో 3 మరియు పార్నెల్ 2 వికెట్లు సాధించారు. ఓవర్ లలో ఇంత భారీ స్కోర్ చేయడం  ప్రపంచంలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఈ స్కోర్ ను సౌత్ ఆఫ్రికా ఛేదించడం అసాధ్యమే అని అంతా ఫైనల్  అయిపోయారు.

కానీ గత మ్యాచ్ లో ఓడిన సౌత్ ఆఫ్రికా... ఇందులో కూడా ఓడిపోతే సిరీస్ ను కోల్పోయే ప్రమాదం ఉండడంతో మొదటి బంతి నుండి ఓపెనర్లు డికాక్ మరియు హెన్డ్రిక్స్ లు విండీస్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు కేవలం 65 బంతుల్లోనే పరుగులు 152 జోడించాక డికాక్ 100 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. డికాక్ ఇన్నింగ్స్ లో 8 సిక్సులు మరియు 9 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత హెన్డ్రిక్స్ కూడా వేగంగా ఆడే క్రమంలో 68 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. కానీ అప్పటికే సౌత్ ఆఫ్రికా విజయం ఖరారు అయిపోయింది. కానీ వరుసగా రెండు వికెట్లు పడడంతో 19 వ ఓవర్ వరకు మ్యాచ్ వెళ్ళింది.

ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లు కలిపి 517 పరుగులు నమోదు కావడం కొసమెరుపు. ఆడే విధంగా రెండు టీం లలో ఉన్న ప్లేయర్స్ బాదిన సిక్సులు 35 మరియు ఫోర్లు 46 కావడం మరో ఎత్తు. ఈ మ్యాచ్ మరికొంతకాలం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ విజయంతో మూడు టీ ల సిరీస్ 1 -1 తో సమంగా ఉంది. మరి సిరీస్ డిసైడర్ గా నిలిచే మూడవ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో తెలియాల్సి ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: