
గత ఏడాది జరిగిన మినీ వేలం కారణంగా ఎంతో మంది ఆటగాళ్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు వెళ్లిపోయారు. అంతేకాదు కొన్ని జట్లు కూడా కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. దీంతో ఏ జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంది అని చెప్పాలి. ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్లు జరిగిన తర్వాత అటు విశేషకులు కూడా ఈ ఏడాది ఐపీఎల్ విజేత ఎవరు అనే విషయంపై ఒక అంచనాకు వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఐపీఎల్ ఛాంపియన్ టీం ముంబై ఇండియన్స్ కు కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉంటాడు అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.
కాగా ఇటీవల జరిగిన ఒక విషయంతో రోహిత్ అభిమానులు అందరూ కూడా మరింత ఆందోళనలో మునిగిపోయారు. సాధారణంగా ప్రతి ఏడాది కూడా ఇక అన్ని జట్ల కెప్టెన్లు ఒకచోట చేరి ఐపీఎల్ ట్రోఫీతో ఫోటోలోకి ఫోజులు ఇవ్వడం చేస్తూ ఉంటారు. ఇటీవల అన్ని టీంల కెప్టెన్లు కూడా ఇలాగే ఫోటో దిగారు. కానీ ఇక ఈ ఫ్రేమ్ లో తొమ్మిది టీం ల కెప్టెన్లు మాత్రమే కనిపిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మిస్ అయ్యాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారగా.. ఇక ముంబై కెప్టెన్ రోహిత్ లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రోహిత్ ఎక్కడ అంటూ అంటూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.